Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ మీద శివాజి ఫైర్.. బద్దలు కొట్టి మరీ వెళ్తానంటూ..!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఒకప్పటి హీరో శివాజి ఎంట్రీ తెలిసిందే. 3 రోజుల ఆటలో అతను సరదాగా హౌస్ లో అందరితో బాగానే ఉంటూ వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 9:36 AM GMT
బిగ్ బాస్ మీద శివాజి ఫైర్.. బద్దలు కొట్టి మరీ వెళ్తానంటూ..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో ఒకప్పటి హీరో శివాజి ఎంట్రీ తెలిసిందే. 3 రోజుల ఆటలో అతను సరదాగా హౌస్ లో అందరితో బాగానే ఉంటూ వస్తున్నాడు. అయితే హౌస్ లో ఎలాంటి గొడవ లేకపోతే ఎలా అనుకున్నాడో ఏమో కానీ కాఫీ పౌడర్ కోసం శివాజి అగ్గిమీద గుగ్గీలవుతున్నాడు. తనకు కాఫీ పొడి కావాల్సిందే అంటూ బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు గంటలో కాఫీ పౌడర్ రాకపోతే ఏం చేస్తానో తెలియదని ఫైర్ అయ్యాడు. చేతిలో ఉన్నది కిందకు విసిరి కొట్టి.. వెళ్తూ వెళ్తూ కాలితో ఒక బుట్టని తన్నాడు.

డోర్ తీస్తే వెళ్లిపోతా.. తీయకపోతే బద్దలు కొట్టి మరీ వెళ్తా అన్నట్టుగా మాట్లాడాడు శివాజి. హౌజ్ లోకి వెళ్లేప్పుడే అక్కడ బిగ్ బాస్ ఆదేశాలకు అనుగుణంగా ఉండాలనే కండీషన్ ఉంటుంది. మరి ఇప్పుడు కాఫీ పౌడర్ కోసం శివాజి చేస్తున్న హంగామా ఏంటో ఆయనకే అర్ధమవ్వాలి. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చూసిన బిగ్ బాస్ ఆడియన్స్ శివాజి లో ఫైర్ చూసి కంగారు పడుతున్నారు. అయితే ఇదేదో సీక్రెట్ టాస్క్ లో భాగం అని డౌట్ పడుతున్న వారు ఉన్నారు. శివాజి ఆవేశంగా ఉంటే గౌతం కృష్ణని బీపీ చూడమని స్తెతస్కోప్ పంపించారు.

దానికి శివాజి నిరాకరించగా రతిక కి హౌజ్ లో ఉన్న వారి గుండెల్లో ఏముందో తెలుసుకోమని చెప్పారు. మొత్తానికి శివాజి సీరియస్ నెస్ ని బిగ్ బాస్ కామెడీ చేయాలని చూశారు. అయితే అది టాస్క్ లో భాగమా లేక నిజంగానే శివాజికి కోపం వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ శివాజి నిజంగానే కాఫీ పౌడర్ కోసం అంత సీన్ చేస్తే మాత్రం అతనికి నెగటివ్ మార్కులు పడినట్టే. అంతేకాదు ఆవేశంలో కాలితో బుట్ట ని తన్నడం లాంటివి హోస్ట్ నాగార్జున అసలు క్షమించడు.

మరి శివాజి రియాక్షన్ కి అసలు యాక్షన్ ఏంటి..? ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది. శివాజి ఎలా కూల్ అయ్యాడన్నది ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఇదో పక్క నడుస్తుంటే టేస్టీ తేజ శుభ శ్రీ తో పులిహోర కలిపే ప్రయత్నంలో ఉన్నాడు. టాస్క్ లో భాగంగా టేస్టీ తేజ అమ్మాయి గెటప్ లో రెడీ అవుతుండగా తనకు పెదాల మీద లిప్ స్టిక్ కావాలని అన్నాడు. అంటే తన ఉద్దేశంతో ముద్దు ఇవ్వమని అన్నమాట. తేజ మాటలకు శుభ శ్రీ షాక్ అవగా షకీల అతని బుగ్గ మీద లిప్ స్టిక్ అంటేలా ముద్దు పెట్టారు. తేజా తనకు దేవుడు ఇచ్చిన బిడ్డ అని అన్నారు షకీల. ఇక ఆల్రెడీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రతికలు హౌజ్ లో పులిహోర కలపడం మొదలు పెట్టారు. వారం తిరగకుండానే ఇక్కడ జంటలు ఏర్పడే అవకాశం ఉందని అనిపిస్తుంది.