Begin typing your search above and press return to search.

త‌మిళ హీరోలే కాదు తెలుగు హీరోలు అమెరికా చ‌లో

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజ‌య్ ఇప్పుడు లెక్ టెస్ట్ కోసం అమెరికాలో అడుగుపెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది

By:  Tupaki Desk   |   30 Aug 2023 6:36 AM GMT
త‌మిళ హీరోలే కాదు తెలుగు హీరోలు అమెరికా చ‌లో
X

ఇటీవ‌లి కాలంలో భార‌తీయ సినిమా రేంజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా ప్రాంతీయ సినిమా హ‌వా పాన్ ఇండియా స్థాయికి చేర‌డంతో ప్ర‌తిదీ కీల‌కంగా మారింది. ముఖ్యంగా తెలుగు-త‌మిళంలో అగ్ర హీరోల‌కు ఇది బిగ్ ఛాలెంజ్ గా మారింది. హీరోలు అన్నిటా జాగ్ర‌త్త వ‌హించాలి. ముఖ్యంగా త‌మ లుక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వ‌స్తోంది. పాన్ ఇండియా ఆడియెన్ ని మెప్పించాలంటే అందుకు త‌గ్గ‌ట్టు ఫిజిక్ ని మెయింటెయిన్ చేయాలి.. దానికి తోడు లుక్స్ ప‌రంగా కూడా మెప్పించాల్సి ఉంటుంది. కార‌ణం ఏదైనా కానీ ఇటీవ‌ల మ‌న స్టార్లు లుక్ టెస్ట్ కోసం అగ్ర రాజ్యం అమెరికాలో వాలిపోతున్నారు. తెలుగు హీరోలు మాత్ర‌మేనా? అంటే అటు త‌మిళ‌నాడు నుంచి కూడా స్టార్ హీరోలు అమెరికాలో దిగిపోతున్నారు. అక్క‌డ లుక్ టెస్టులు చేసుకుని అవ‌స‌రం మేర మేకోవ‌ర్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.


డార్లింగ్ ప్ర‌భాస్.. రామ్ చ‌ర‌ణ్‌.. అల్లు అర్జున్ .. దేవ‌ర‌కొండ‌.. ఇలా స్టార్లంతా త‌మ లుక్ మెరుగుద‌ల కోసం అమెరికా వెళ్లి వ‌స్తున్నార‌న్న స‌మాచారం ఉంది. వారి సినిమాల ప్ర‌మోష‌న్స్ లో ఇటీవ‌ల ఈ త‌ర‌హా విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గ‌తంలో కేవ‌లం స‌ర్జ‌రీల కోస‌మో లేదా ఇంకేదైనా ఆప‌రేష‌న్ కోస‌మో అమెరికాకు వెళ్లేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. ప్ర‌తి హీరో ఇటీవ‌లి కాలంలో అత్యుత్త‌మ రూపంతో యూనివ‌ర్శ‌ల్ ఆడియెన్ కి క‌నెక్ట‌వ్వాల‌ని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ప‌ర్య‌వ‌సానంగా లుక్ టెస్ట్ కి క్రేజ్ పెరిగింది. ఈ క్రేజ్ అమెరికా వర‌కూ తీసుకెళుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజ‌య్ ఇప్పుడు లెక్ టెస్ట్ కోసం అమెరికాలో అడుగుపెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన త‌దుప‌రి చిత్రం (ద‌ళ‌పతి 68) లుక్ టెస్ట్ కోసం విజయ్ USAలోని లాస్ ఏంజెల్స్‌లో అడుగుపెట్టాడు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారని స‌మాచారం. అయితే దీనిని ఇంకా మేకర్స్ ధృవీకరించలేదు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ ప్రాజెక్ట్‌కు AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. షూటింగ్ స‌హా ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. విజ‌య్ -లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేషన్ మూవీ లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాలో త్రిష కథానాయికగా నటించింది.