Begin typing your search above and press return to search.

ఆదికేశవని ఆ హీరో నిజంగానే రిజెక్ట్ చేశాడా?

నిజానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారని టాక్. అయితే వరుణ్ తేజ్ ఏవో కారణాల వలన ఈ కథని రిజక్ట్ చేశారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 5:07 AM GMT
ఆదికేశవని ఆ హీరో నిజంగానే రిజెక్ట్ చేశాడా?
X

వైష్ణవ్ తేజ్, శ్రీలీల కాంబినేషన్ లో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ యాక్షన్ జోనర్ కథ చేసిన ఈ సినిమా రొటీన్ ఫార్మాట్ లో ఉందనే విమర్శలు వచ్చాయి. మూవీ రిలీజ్ తర్వాత బోయపాటి స్కంద, వినయ విదేయ రామ సినిమాలతో కంపారిజన్ చేస్తున్నారు. ఓవర్ ది లైన్ అనే విధంగానే ఈ మూవీలో సీన్స్ ఉన్నాయనే టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక్క శ్రీలీల పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. వైష్ణవ్ తేజ్ పెర్ఫార్మెన్స్ పరంగా తెలిపోయారని సినీ విశ్లేషకులు రాసుకొచ్చారు. శ్రీకాంత్ రెడ్డి హైవోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ వేసుకున్న దానికి తగ్గ కథని పెర్ఫెక్ట్ గా రెడీ చేసుకోలేదనే ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన. ఇదిలా ఉంటే ఈ సినిమాని శ్రీకాంత్ రెడ్డి వైష్ణవ్ తేజ్ కోసం రాసుకోలేదంట.

నిజానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారని టాక్. అయితే వరుణ్ తేజ్ ఏవో కారణాల వలన ఈ కథని రిజక్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో అందరికి వినిపించిన మీదట ఫైనల్ గా వైష్ణవ్ తేజ్ దగ్గరకి వచ్చి ఆగిందట. సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉండటంతో ఈ సినిమాని చేయడానికి వైష్ణవ్ తేజ్ ఒప్పుకున్నాడని టాక్ వస్తోంది.

నిజానికి వరుణ్ తేజ్ ఆ సినిమా చేసినా అంతగా సెట్ అయ్యేది కాదు. అసలే ప్రయోగాలు అంటూ డిజాస్టర్స్ చూస్తున్న వరుణ్ కు ఇలాంటి సినిమా చేసి ఉంటే మరింత ఎఫెక్ట్ పడేది. అయితే ఈ మెగా హీరోకి ఆదికేశవ అదృష్టాన్ని ఇవ్వలేదు. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడగలేదు. అయితే కొండపొలం పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

కాని ఆదికేశవ ఆ రెండింటికి మించి డివైడ్ టాక్ తెచ్చుకుంది. మరి వీకెండ్ తర్వాత థియేటర్స్ లో మూవీ ఎంత వరకు నిలబడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ చేసిన కూడా వైష్ణవ్ తేజ్ కి అవేవీ సెట్ కాలేదనే మాట వినిపిస్తోంది. శ్రీలీల ఖాతాలో స్కంద తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఆదికేశవ చేరింది. ఇక ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు కాస్త జాగ్రత్తలు తీసుకొని తదుపరి సినిమాలు చేస్తే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.