Begin typing your search above and press return to search.

మెగా రూమర్​.. ఆ థ్రిల్లర్​​ సీక్వెల్​కు హీరో నో ఇంట్రెస్ట్!​

దీంతో ఓ కొత్త రూమర్ సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. ఆ సినిమా హీరోకు నిర్మాతలకు మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని బయట కథనాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2023 2:30 AM GMT
మెగా రూమర్​.. ఆ థ్రిల్లర్​​ సీక్వెల్​కు హీరో నో ఇంట్రెస్ట్!​
X

సినీ పరిశ్రమలోని ఓ బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ యంగ్​ హీరో.. ఈ ఏడాది ఏప్రిల్​ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్​ సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ ప్రమాదం నుంచి కోలుకుని కాస్త గ్యాప్ ఇచ్చి వచ్చిన ఆయన.. ఓ మిస్టీక్ థ్రిల్లర్​ సినిమాతో వచ్చి ఊహించని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్​ హిట్​ను అందుకుని గట్టి కమ్​ బ్యాక్ ఇచ్చారు. అయితే తాజాగా ఆ సినిమాకు సీక్వెల్​ను ప్రకటించారు. ఓ ఇంట్రెస్టింగ్​ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. ఈ సారి మైథికల్ థ్రిల్లర్​ టైమ్ అంటూ రాసుకొచ్చారు.

అయితే ఈ సినిమా దర్శకుడు-నిర్మాణసంస్థ పేరును ప్రకటించారు గానీ హీరో పేరును చెప్పకపోవడం గమనార్హం. దీంతో ఓ కొత్త రూమర్ సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. ఆ సినిమా హీరోకు నిర్మాతలకు మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని బయట కథనాలు వస్తున్నాయి. అందుకే ప్రొడ్యూసర్స్​ మరో కొత్త హీరో కోసం వెతుకుతున్నారని తెలిసింది.

మొదటి భాగం రిలీజ్ అయ్యాక హీరోకు-నిర్మాతలకు ఈ మనస్పర్థలు తలెత్తాయట. ప్రాఫిట్ షేరింగ్​లో హీరోకి కావాల్సినంత షేర్​ను నిర్మాతలు ఇవ్వలేదట. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి.. ఈ రెండో భాగం కోసం జీరో ఇంట్రెస్ట్ కూడా చూపించలేదని తెలిసింది. అందుకో ఈ కొత్త సీక్వెల్ అనౌన్స్​మెంట్​ హీరో పేరు లేకుండానే పోస్టర్​ను రిలీజ్​ చేశారట మేకర్స్​.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇంకో వార్త కూడా వినిపిస్తోంది. మూవీటీమ్​కు బాగా దగ్గరైన ఓ ప్రతినిధి.. ఈ సినిమా మొదటి భాగానికి సీక్వెల్​ కాదని అన్నారు. ఎందుకంటే ఈ రెండో భాగం కోసం కొత్త హీరోను వెతుకుతున్నారట. అందుకే ఈ చిత్ర కథ వేరేలా ఉండేలా, కనీసం మొదటి భాగం ఫ్రాంచైజీతో కూడా సంబంధం లేకుండా ఉండేలా చూస్తున్నారట. కాకపోతే హీరో తప్ప ఇతర టీమ్​ మాత్రం సేమ్​ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా కేవలం హీరోతో వచ్చిన డిఫరెన్సెస్​ వల్లే ఇలా చేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇకపోతే ఈ మొదటి భాగం హీరో.. ఈ మధ్యే తన కుటుంబానికి చెందిన మరో పెద్ద హీరోతో కలిసి ఓ సినిమాతో బాక్సాఫీస్ ముందు సందడి చేశారు. ఇది మిక్స్​డ్​ టాక్​ను అందుకుంది. అయితే ఈ చిత్రం రాజకీయంగా ఎన్నో విమర్శలను, వివాదాలను కూడా ఎదుర్కొంది. సినిమా సోషల్​మీడియాలో అటు పాజిటివ్​గా ఇటు నెగటివ్​గా బాగా ట్రెండ్​ అయింది. మరీ రాజకీయ విమర్శల వల్ల ఫ్రీ పబ్లిసిటీని బాగా అందుకుంది.