Begin typing your search above and press return to search.

ఆ స్టార్ అదే ఎఫెర్ట్ సినిమాల్లో పెడితే!

ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ లు జ‌నాల్లోకి ఎంత బ‌లంగా వెళ్తున్నాయి అన్న‌ది తెలియ‌దుగానీ ఇదే ఎఫెర్ట్ సినిమాల్లో పెట్టి ఉంటే ఇంకా పెద్ద స్టార్ అయ్యేవాడు అనే ప్ర‌చారం తాజాగా తెర‌పైకి వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   9 March 2024 12:30 AM GMT
ఆ స్టార్ అదే ఎఫెర్ట్ సినిమాల్లో పెడితే!
X

టాలీవుడ్ లో ఓస్టార్ హీరో రాజ‌కీయం- సినిమా అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తోన్న సంగ‌తి తెలి సిందే. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటూ కేవ‌లం సీరియ‌స్ గా రాజ‌కీ యాలపైనే దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నారు. అయితే సీరియ‌స్ గా ఆయ‌న చేస్తోన్న ప్ర‌సంగాల‌పై ర‌క‌ర‌కాల విశ్లేషణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ లు జ‌నాల్లోకి ఎంత బ‌లంగా వెళ్తున్నాయి అన్న‌ది తెలియ‌దుగానీ ఇదే ఎఫెర్ట్ సినిమాల్లో పెట్టి ఉంటే ఇంకా పెద్ద స్టార్ అయ్యేవాడు అనే ప్ర‌చారం తాజాగా తెర‌పైకి వ‌స్తోంది.

ఉద్వేగంగా..ఉద్విగ్నంగా ఆయ‌న చేస్తోన్న వ్యాఖ్య‌లు సినిమాల్లో చేసి ఉంటే? ఆయ‌న కోసం అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ రోల్ రాసి ఉంటే? ఇంకా పెద్ద హీరో అయ్యేవార‌ని అంటున్నారు. అయితే ఈ ప్ర‌చారాన్ని ఆ హీరో కూడా స్వాగ‌తించ‌డం విశేషం. తాను హీరోగా ఏ సినిమా అంత‌గా ఎఫెర్ట్ పెట్టి ప‌నిచేయ‌లేద‌ని ..నిజంగా రాజ‌కీయా ల్లో ప‌నిచేసింత క‌సి ప‌ట్టుద‌ల‌తో సినిమాలు చేసి ఉంటే ఇంకా పెద్ద స్టార్ అయ్యేవాడిన‌ని ఆయ‌న కూడా అనేసారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో ఓ డైరెక్ట‌ర్ ని ప‌రిచ‌యం చేస్తూ ఆయ‌న చేసిన కొన్ని సినిమా ప‌వ‌ర్ ఫుల్ డైలా గుల్ని గుర్తు చేస్తున్నారు. తాజాగా ఆ హీరో వేగం చూసి అదే డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇస్తే మంచి సినిమా తీస్తాడ‌ని అంటున్నారు. ఆహీరో వేగాన్ని ఆడైరెక్ట‌ర్ మాత్ర‌మే అందుకుని డైలాగులు రాయ‌గ‌ల‌డ‌ని.. అత‌డి వ్య‌క్తిత్వం కూడా అత‌నికి ద‌గ్గ‌ర‌గా తెలుసు కాబ‌ట్టి మంచి ఔట్ ఫుట్ వ‌స్తుంద‌ని అంటున్నారు.

మ‌రి పొలిటిక‌ల్ బిజీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత స‌ద‌రు హీరో అలాంటి ప్లానింగ్ ఏదైనా చేస్తాడేమో చూడాలి. దీనికంటే ముందు ఆయ‌న క‌మిట్ అయిన కొన్ని సినిమాలు అంత‌కంటే ముందు పూర్తి చేయాల్సి ఉంది. ఆయ‌న ఎప్పుడు సెట్స్ కి వ‌స్తాడా? అని ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు.