Begin typing your search above and press return to search.

ఖైదీ జోరు.. ఒకేసారి రెండు సీక్వెల్స్‌

ఈ మధ్య కాలంలో హిట్‌ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే చాలా హిట్ సినిమాల సీక్వెల్స్ వచ్చాయి

By:  Tupaki Desk   |   18 Nov 2023 6:27 AM GMT
ఖైదీ జోరు.. ఒకేసారి రెండు సీక్వెల్స్‌
X

ఈ మధ్య కాలంలో హిట్‌ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే చాలా హిట్ సినిమాల సీక్వెల్స్ వచ్చాయి. అందులో కొన్ని మంచి ఫలితాలను చవిచూశాయి. అందుకే పలువురు దర్శకులు హీరోలు సీక్వెల్‌ పై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా సీక్వెల్స్ రాబోతున్నాయి.

తమిళ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్‌ ఇండియన్ 2. ఈ సినిమా తో పాటు తమిళ్‌ మూవీ ఖైదీ కి కూడా సీక్వెల్‌ రాబోతున్న విషయం తెల్సిందే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఖైదీ సీక్వెల్ ని వచ్చే ఏడాది లో పట్టాలెక్కించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలోనే సీక్వెల్‌ ను చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు కార్తీ మరో సీక్వెల్‌ తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీ హీరోగా అయిదేళ్ల క్రితం వచ్చి హిట్‌ అయిన మూవీ ఖాకీ.

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఖాకీ సినిమాకు అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ గా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. అందుకే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ చేస్తానంటూ దర్శకుడు హెచ్ వినోద్‌ ప్రకటించాడు.

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడిగా మారిన హెచ్ వినోద్‌ వచ్చే ఏడాది లో ఖాకీ సినిమా సీక్వెల్‌ ను పట్టాలెక్కించే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడు. అదే జరిగితే ఒకే సారి రెండు సీక్వెల్స్ చేస్తున్న హీరోగా కార్తీకి అరుదైన రికార్డ్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కార్తీ హీరోగా వచ్చిన జపాన్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. కనుక ఈ సీక్వెల్స్ అక్కడ ఇక్కడ కార్తికి సక్సెస్‌ ను తెచ్చి పెట్టేనా చూడాలి.