Begin typing your search above and press return to search.

ఎక్స్ ట్రా రిజల్ట్.. హీరో హీరోయిన్ కంటే అతనికే ఎక్కువ..

ఇక సినిమాలో సీనియర్ హీరో యాంగ్రీ హీరో రాజశేఖర్ కూడా ఒక స్పెషల్ పాత్రలో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చారు

By:  Tupaki Desk   |   30 Nov 2023 1:30 AM GMT
ఎక్స్ ట్రా రిజల్ట్.. హీరో హీరోయిన్ కంటే అతనికే ఎక్కువ..
X

డిసెంబర్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమా కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్స్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. నితిన్ గతంలో ఎప్పుడు లేనంత స్టైలిష్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా సినిమాలో మంచి ఫన్ అలాగే యాక్షన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు.

ఇక సినిమాలో సీనియర్ హీరో యాంగ్రీ హీరో రాజశేఖర్ కూడా ఒక స్పెషల్ పాత్రలో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ఎలాగైనా నితిన్ సక్సెస్ అందుకుని మళ్ళి ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. అలాగే హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాపై మంచి హోప్స్ పెట్టుకుంది.

అయితే వీరిద్దరి సంగతి పక్కన పెడితే మాత్రం దర్శకుడికి మాత్రం ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి రచయితగా అతను గుర్తింపును అందుకున్నాడు. ఎక్కువగా సురేందర్ రెడ్డి సినిమాలకు స్టోరీలు అందించిన విషయం తెలిసిందే. రేసుగుర్రం కిక్ సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే అలాగే టెంపర్ లాంటి కథను కూడా అందించాడు

వక్కంతం వంశీ ఇప్పటివరకు దర్శకుడిగా ఒకే ఒక్క సినిమా తీశాడు. అల్లు అర్జున్ తో చేసిన నా పేరు సూర్య అనే సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎలాగైనా ఈ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో సక్సెస్ అందుకునే బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాడు. నా పేరు సూర్య సినిమా డిజాస్టర్ అయిన తర్వాత కూడా చాలామంది హీరోల దగ్గరికి వెళ్లే డైరెక్షన్స్ ఛాన్స్ కోసం వంశీ గట్టిగానే ప్రయత్నాలు చేశాడు.

కానీ ఎవరు కూడా అతన్ని నమ్మలేదు. ఇక నితిన్ అతనికి మంచి ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాతో మిస్ ఫైర్ అవ్వకూడదు అని అనుకుంటున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే మరొ రేంజ్ హీరోలు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి వంశీ ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.