Begin typing your search above and press return to search.

మరో మెగాహీరోతో ఆ హీరోయిన్​ రిలేషన్​షిప్​..?

చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులతో పాటు హీరో నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, హీరోయిన్​ రీతూవర్మ సహా పలువురు సన్నిహితులు ఈ పార్టీలో సందడి చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 9:37 AM GMT
మరో మెగాహీరోతో ఆ హీరోయిన్​ రిలేషన్​షిప్​..?
X

హీరోయిన్​ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ప్రిన్​ వరుణ్ తేజ్​ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రేమించుకుని వివాహం చేసుకోబోతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ రీతూ వర్మ కూడా మరో మెగా హీరోతో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు.

దానికి కారణం వివరాళ్లోకి వెళితే.. వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు సందడి సందడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే రీసెంట్​గా మెగాస్టార్​ చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరగగా.. తాజాగా అల్లు ఫ్యామిలీ నివాసంలోనూ గ్రాండ్‌ పార్టీ జరిగింది. కాబోయే నూతన వధూవరులకు కంగ్రాట్స్‌ చెబుతూ హీరో అల్లు అర్జున్‌ ఫ్యామిలీ మెంబర్​ ఈ పార్టీని ఏర్పాటు చేశారు.

చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులతో పాటు హీరో నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, హీరోయిన్​ రీతూవర్మ సహా పలువురు సన్నిహితులు ఈ పార్టీలో సందడి చేశారు. అయితే వీరందరిలో నెటిజన్ల ఫోకస్​ హీరోయిన్​ రీతూ వర్మపై పడింది. దీంతో ప్రస్తుతం ఆమె నెట్టింట్లో ఫుల్​ ట్రెండింగ్ అవుతోంది. అందుకు కారణం ఆ పార్టీ కి అటెండ్ అవ్వడమే.

అదేంటంటే.. రీతూవర్మ.. ఆ పార్టీ పిక్స్ లో కనిపించగానే వేరే మెగా హీరో ఎవరితో అన్న డేటింగ్ లో ఉందా అంటూ కామెంట్స్ వచ్చేస్తున్నాయి . అయితే ఇందులో నిజమెంతో తెలీదు ప్రస్తుతం ఈ విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. గతంలోనూ నిహారిక పెళ్లి జరిగినప్పుడు లావణ్య త్రిపాఠి ఇలానే హాజరై సందడి చేసింది. ఆ తర్వాత వరుణ్​ - లావణ్య ప్రేమలో ఉన్నారని వార్తలు మరింత ఎక్కువ అవ్వడం, అది నిజమై ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు రీతూ విషయంలో కూడా అలానే జరుగుతుందా అని అందరూ అనుకుంటున్నారు.

కానీ నిజానికి ఇండస్ట్రీలో రీతూవర్మ - లావణ్య త్రిపాఠి మంచి స్నేహితులు. గతంలోనూ వీరిద్దరు కలిసి చాలా సార్లు పలు ఈవెంట్లలో సందడి చేశారు. అలాగే నిహారికకు కూడా రీతూవర్మ మంచి ఫ్రెండ్​. ఆ అనుబంధంతోనే రీతూవర్మ.. తాజాగా ఈ ప్రీ వెడ్డింగ్​ సెలబ్రేషన్స్​కు హాజరై సందడి చేసింది.