Begin typing your search above and press return to search.

ఆ రెండిటితో టాప్ ప్లేస్ గురి పెట్టిన అమ్మడు..!

అందులో ఒకటి మళ్లీ నానితోనే చేస్తుండగా మరో సినిమా పవన్ కళ్యాణ్ తో నటిస్తుంది.

By:  Tupaki Desk   |   23 March 2024 3:00 AM GMT
ఆ రెండిటితో టాప్ ప్లేస్ గురి పెట్టిన అమ్మడు..!
X

కోలీవుడ్ లో అటు యువ హీరోలతో పాటుగా స్టార్స్ తో కూడా నటిస్తూ టాలెంట్ చూపిస్తుంది ప్రియాంక అరుల్ మోహన్. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న అమ్మడిని నాని గ్యాంగ్ లీడర్ సినిమా కోసం తీసుకొచ్చాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకోగా ఆ తర్వాత శర్వానంద్ శ్రీకారం లో కూడా అమ్మడు నటించింది. అయితే ఆ తర్వాత తమిళంలోనే వరుస ఆఫర్లు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ ఉంది ప్రియాంక. అయితే ఆఫ్టర్ గ్యాప్ అమ్మడికి ఒకేసారి రెండు భారీ సినిమాల ఆఫర్లు వచ్చాయి. అందులో ఒకటి మళ్లీ నానితోనే చేస్తుండగా మరో సినిమా పవన్ కళ్యాణ్ తో నటిస్తుంది.


న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ మూవీలో ఛాన్స్ అందుకుంది ప్రియాంక. అయితే ఈ సినిమాకు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న సినిమాలో ఆమెను ఫిక్స్ చేశారు. ఆ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చూసి అదే బ్యానర్ లో వస్తున్న నాని సినిమాలో అమ్మడిని రిపీట్ చేసినట్టు తెలుస్తుంది. డివివి దానయ్య చేస్తున్న వరుస రెండు సినిమాల్లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

న్యాచురల్ స్టార్ నాని తో సరిపోదా శనివారం, పవన్ కళ్యాణ్ తో ఓజీ ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ టాప్ ప్లేస్ కి గురి పెట్టింది ప్రియాంక. గ్యాంగ్ లీడర్ టైం లోనే ప్రియాంక కి తెలుగు ఆడియన్స్ ఫిదా అవ్వగా రాబోతున్న రెండు సినిమాలతో అమ్మడు మరింత క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సరిపోదా శనివారం సినిమా ఆగష్టు చివరన రిలీజ్ అవుతుంటే. సెప్టెంబర్ ఎండింగ్ లో ఓజీ రిలీజ్ ప్లాన్ చేశారు. సో రెండు నెలల్లో రెండు భారీ సినిమాలతో ప్రియాంక సత్తా చాటుతుంది.

ఈ రెండు సినిమాల తర్వాత అమ్మడు తెలుగులో బిజీ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నాని సినిమాలో హీరోయిన్ పాత్రలకు వెయిట్ ఉంటుంది కాబట్టి సరిపోదా శనివారం ప్రియాంక ఖాతాలో ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది. పవర్ స్టార్ ఓజీ తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రియాంక క్రేజ్ తెచ్చుకుంటుంది. సో టాలీవుడ్ లో మిగతా హీరోయిన్స్ కి చెక్ పెట్టేందుకు ప్రియాంక సిద్ధమవుతుందని చెప్పొచ్చు.