Begin typing your search above and press return to search.

హాట్ హీరోయిన్ పెళ్లి వేడుక షురూ

2012 లో ఈమె నటించిన ఇష్క్‌ జాదే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది

By:  Tupaki Desk   |   26 Oct 2023 8:35 AM GMT
హాట్ హీరోయిన్ పెళ్లి వేడుక షురూ
X

2011లో లేడీస్‌ వర్సెస్‌ రికీ బహ్ల్‌ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా దశాబ్ద కాలం పాటు బాలీవుడ్‌ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు ఆమె స్థాయిని అంతకంతకు పెంచాయి. కమర్షియల్ సినిమాల్లోనే కాకుండా కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించింది.


2012 లో ఈమె నటించిన ఇష్క్‌ జాదే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతే కాకుండా ఆస ఇనిమాలో నటనకు గాను జాతీయ ఫిలిం అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా తక్కువ సమయంలోనే తన సత్తా చాటిన పరిణీతి చోప్రా ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు రాజకీయ నాయకుడు రాఘవ్‌ చద్దా ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది.


వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని బయటకు తెలియనివ్వలేదు. అయితే సెలబ్రిటీల ప్రేమ వ్యవహారం ఏదో ఒక సమయంలో బయటకు తెలియాల్సిందే. ఆ మధ్య వీరి ప్రేమ విషయం గురించి పుకార్లు రావడం మొదలైంది... కొన్ని రోజుల తర్వాత ఆ పుకార్లు నిజమే అన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ వర్గాల వారు క్లారిటీ ఇచ్చారు.


రాఘవ్‌ చద్దా తో పరిణీతి చోప్రా వివాహ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఏకం అవ్వబోతున్నారు. పెళ్లి వేడుకలో హీరోయిన్‌ మెహిందీ కార్యక్రమంలో పాల్గొంది. ఎల్లో డ్రెస్ లో పరిణీతి చోప్రా మెరిసి పోతుంది. అంతే కాకుండా ఆమె పెళ్లి హంగామా కూడా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

హాట్ లేడీ పరిణీతి చోప్రా పెళ్లి వేడుక ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ మెహిందీ వేడుక చూస్తేనే అర్థం అవుతోంది అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ కూడా ఉన్నత శ్రేణికి చెందిన వారు, పైగా ఇద్దరూ కూడా వారి వారి కెరీర్‌ లో అత్యున్నత శిఖరాల్లో ఉన్నారు. కనుక రెండు వైపుల నుంచి కూడా పెళ్లి మరియు రిసెప్షన్ కి ప్రముఖులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.