Begin typing your search above and press return to search.

బడా సినిమాలకు గ్లామర్ ప్రాబ్లమ్

అయితే ఆ సాంగ్ లో సినిమా హీరోయిన్ శ్రీలీలనే చిందులేసింది. ప్రత్యేకంగా ఎవరినీ తీసుకోలేదు మేకర్స్.

By:  Tupaki Desk   |   25 April 2024 12:30 PM GMT
బడా సినిమాలకు గ్లామర్ ప్రాబ్లమ్
X

సినిమాలో ఐటెం సాంగ్ కు స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. గ్లామర్ తో హీటెక్కించాలి అంటే ఒక స్పెషల్ సాంగ్ పడాల్సిందే. గత కొద్ది నెలలుగా థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ఐటెం సాంగ్లు పెద్దగా లేవు. సూపర్ స్టార్ గుంటూరు కారం మూవీలోని స్పెషల్ సాంగ్ కుర్చీ మడతపెడితే పాట ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సాంగ్ లో సినిమా హీరోయిన్ శ్రీలీలనే చిందులేసింది. ప్రత్యేకంగా ఎవరినీ తీసుకోలేదు మేకర్స్.


ఇక త్వరలో విడుదల కానున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో మోత మోగిపోద్ది ఐటెం సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ తన హావభావాలతో అదరగొట్టేసింది. విశ్వక్ తో చిందులు ఓ రేంజ్ లో వేసింది. దీంతో ఈ ఐటెం సాంగ్ కోసం మాస్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇది పక్కన పెడితే.. టాలీవుడ్ అప్ కమింగ్ బడా మూవీలు పుష్ప-2, రాజా సాబ్, దేవర, గేమ్ ఛేంజర్ లో కూడా స్పెషల్ సాంగ్స్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పాటల కోసం ఐటెం గాళ్స్ ఎంపిక మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలు కనుక.. స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడే భామలు కూడా అదే స్థాయిలో ఉండాలి. దీంతో దర్శకనిర్మాతలు.. సరైన బ్యూటీల కోసం సెర్చింగ్ చేస్తున్నారట.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 మూవీలోని స్పెషల్ సాంగ్ లో చిందులేయనున్న బ్యూటీ కోసం డైరెక్టర్ గత మూడు నెలలుగా వెతుకుతూనే ఉన్నారు. ఆ మధ్య సమంత, శ్రీలీల పుష్ప-2 ఐటెం సాంగ్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇప్పటి వరకు ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయని బ్యూటీ కోసం సుక్కూ వెతుకుతున్నారట.

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ మూవీలో కూడా స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆ పాట రికార్డింగ్ కంప్లీట్ అయినా.. ఐటెం గర్ల్ దొరక్క ఇంకా షూట్ చేయలేదట మేకర్స్. ప్రభాస్ హైట్, కటౌట్ కు తగ్గ బ్యూటీని వెతుకుతున్నారని సమాచారం. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీలో కూడా స్పెషల్ సాంగ్ ఉందని టాక్. చరణ్ తో ఎవరు చిందలేయనున్నారనేది మేకర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు.

మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమాలో అదిరిపోయే మాస్ సాంగ్ ఉంటుందని టాక్ నడుస్తోంది. తారక్ డ్యాన్సింగ్ స్కిల్స్ కు సరిపోయే బ్యూటీని మేకర్స్ వెతుకుతున్నారని వినికిడి. మొత్తానికి తారక్, చరణ్, బన్నీ, ప్రభాస్ కొత్త సినిమాల్లో ప్రస్తుతం 'సరైన ఐటెం గర్ల్ కావలెను' అనే బోర్డు కనిపిస్తుందన్నమాట! మరి ఈ స్టార్ హీరోలతో ఎవరు చిందులేస్తారో వేచి చూడాలి.