Begin typing your search above and press return to search.

అంబానీ వేడుకలో ప్రభాస్ హీరోయిన్‌ సీక్రెట్‌ రివీల్

తెలుగులో మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపించని ముద్దుగుమ్మ శ్రద్ద కపూర్‌ బాలీవుడ్ లో మాత్రం లెక్కకు మించిన సినిమాలకు కమిట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   4 March 2024 7:42 AM GMT
అంబానీ వేడుకలో ప్రభాస్ హీరోయిన్‌ సీక్రెట్‌ రివీల్
X

బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్ద కపూర్‌ ఆ మధ్య ప్రభాస్ తో సాహోలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. తెలుగులో మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపించని ముద్దుగుమ్మ శ్రద్ద కపూర్‌ బాలీవుడ్ లో మాత్రం లెక్కకు మించిన సినిమాలకు కమిట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ అమ్మడు గత కొంత కాలంగా ప్రేమలో ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రైటర్ రాహుల్‌ మోడీ తో ఈమె ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ కూడా వీరి ఫోటోలు వీడియోలు లీక్ అవ్వలేదు. ప్రేమ విషయమై శ్రద్ద కపూర్ కూడా ఎప్పుడూ క్లారిటీ ఇచ్చినట్లు ప్రకటన చేసిందే లేదు.

ఎట్టకేలకు శ్రద్ద కపూర్ మరియు రాహుల్‌ మోడీ ల ప్రేమ కథ నిజమే, ఇద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారు అంటూ నిరూపితం అయ్యింది. అంబానీ ఇంట పెళ్లి వేడుక వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. అంతర్జాతయ స్థాయి స్టార్స్ మరియు సెలబ్రెటీలు హాజరు అవుతున్న ఈ వేడుకలో బాలీవుడ్‌ స్టార్స్‌ కి కూడా ఆహ్వానం అందింది.

ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొనడానికి గాను శ్రద్ద కపూర్ కి ఆహ్వానం అందింది. తన తో పాటు తన బాయ్ ఫ్రెండ్‌ రాహుల్‌ మోడీని వెంట పెట్టుకుని మరీ శ్రద్ద అంబానీ వారి వేడుకల్లో హాజరు అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇన్నాళ్లు తన ప్రేమ విషయాన్ని చాలా సీక్రెట్‌ గా ఉంచుతూ వచ్చిన శ్రద్ద కపూర్‌ ఇప్పుడు తానే స్వయంగా అంబానీ వారి ఇంట పెళ్లి సందడి సందర్భంగా రివీల్‌ చేసినట్లు అయ్యింది. ముందు ముందు వీరి ప్రేమ విషయాలు మరిన్ని తెలిసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వీరి వివాహం ఉంటుందని బాలీవుడ్‌ లో కొత్త ప్రచారం మొదలయ్యింది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.