Begin typing your search above and press return to search.

2023లో డిజాస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన భామలు వీరే..

ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న హీరోయిన్స్ లిస్టుని పరిశీలిస్తే..

By:  Tupaki Desk   |   20 Dec 2023 11:30 AM GMT
2023లో డిజాస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన భామలు వీరే..
X

2023 ఎండింగ్ కి వచ్చేసాం. ఈ సంవత్సరంలో ఎంతోమంది కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొత్త కొత్త సినిమాలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొందరు ఎవ్వరూ ఊహించని విధంగా సక్సెస్ అందుకున్నారు. మరికొందరు మొదటి సినిమాతోనే భారీ ప్లాప్స్ సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న హీరోయిన్స్ లిస్టుని పరిశీలిస్తే..

గాయత్రీ భరద్వాజ్.. రవితేజ హీరోగా వచ్చిన 'టైగర్ నాగేశ్వరావు' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. సాక్షి వైద్య.. అక్కినేని అఖిల్ సరసన 'ఏజెంట్' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. ఆ తర్వాత 'గాండీవ దారి అర్జున' సినిమాలో నటించి మరో ప్లాప్ ని తన ఖాతాలో వేసుకుంది.

నుపుర్ సనన్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరి అయిన ఈమె రవితేజ కి జోడిగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా ఆమెకు సక్సెస్ అందించలేకపోయింది. ఆ తర్వాత కన్నప్పలో ఛాన్స్ వచ్చినా కాదనుకొని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. గీతికా తివారి : తేజ 'అహింస' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది.

యుక్తి తరేజా : నాగశౌర్యకు జోడిగా 'రంగ బలి' సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈమె తన క్యూట్ యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసింది. కానీ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఐశ్వర్యా మీనన్ : నిఖిల్ హీరోగా వచ్చిన 'స్పై' మూవీ తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నటనతో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది. ప్రియా భవానీ శంకర్ : 'కళ్యాణం కమనీయం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈమె ఫస్ట్ మూవీ తోనే డిజాస్టర్ అందుకుంది.