Begin typing your search above and press return to search.

హీరోల‌కు ధీటుగా హీరోయిన్లు త‌గ్గేదేలే!

ఎలాంటి స‌న్నివేశాల‌కైనా మేము సైతం అంటూ రంగంలోకి దిగుతున్నారు. సాహ‌సోపేత‌మైన స‌న్నివేశాల విష‌యంలో హీరోయిన్లు మ‌రింత ఉత్సాహం చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 12:30 PM GMT
హీరోల‌కు ధీటుగా హీరోయిన్లు త‌గ్గేదేలే!
X

హీరోయిన్లు అంటే కేవ‌లం నాలుగు పాట‌లు..రొమాంటిక్ స‌న్నివేశాల‌కే ప‌రిమితం కాలేదు. వాళ్ల పాత్ర‌ల్ని సైతం మేక‌ర్స్ హీరోల‌కు ధీటుగా సిద్దం చేస్తున్నారు. క‌థ‌లో నాయిక‌లకు ఎక్కువ ప్రాధాన్య‌త కల్పిస్తు న్నారు. దీంతో హీరోయిన్లు కూడా హీరోల‌కు పోటాపోటిగా స‌న్న‌ధం అవుతున్నారు. ఎలాంటి స‌న్నివేశాల‌కైనా మేము సైతం అంటూ రంగంలోకి దిగుతున్నారు. సాహ‌సోపేత‌మైన స‌న్నివేశాల విష‌యంలో హీరోయిన్లు మ‌రింత ఉత్సాహం చూపిస్తున్నారు.

ప్రారంభానికి ముందే అందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌త్యేక‌ శిక్ష‌ణ సైతం తీసుకో వ‌డానికి రెడీగా ఉంటున్నారు. తాజాగా సంయుక్తా మీన‌న్..సాయి ప‌ల్ల‌వి.. కృతి శెట్టి లాంటి భామ‌ల పేర్లు కూడా ఈ రేసులో క‌నిపిస్తు న్నాయి. ప్ర‌స్తుతం సంయుక్తా మీన‌న్ నిఖిల్ హీరోగా న‌టిస్తోన్న 'స్వ‌యంభూ' తెర‌కెక్కుతోన్న సంగితెలిసిందే. ఇదొక పీరియాడిక్ చిత్రం. దీంతో ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా క‌త్తియుద్దాలు..గుర్ర‌పు స్వారీలపై ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోన్న సంయుక్తా మీన‌న్ కూడా నిఖిల్ కి ధీటుగానే స‌న్న‌ధం అవుతుంది. అమ్మ‌డు అవ‌స‌రం మేర గుర్రుపు స్వారీ నేర్చుకుంటున్న‌ట్లు తాజాగా రివీల్ చేసింది. యుద్ద స‌న్నివేశాలు కూడా ఉండ‌టంతో ఆ ర‌కంగానూ శిక్ష‌ణ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కొత్త విషయాలు నేర్చుకునేంద‌కు తానెప్పుడు సిద్దంగానే ఉంటుంద‌ని రివీల్ చేసింది. గుర్ర‌పు స్వారీ నేర్చుకుంటోన్న ఫోటోల్ని షేర్ చేసింది.

ఇక సాయి ప‌ల్ల‌వి నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తోన్న 'తండేల్' లో హీరోయిన్ గాన‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓ మ‌త్స‌కారుడి జీవితం ఆధారంగా చందు మొండేటి తెర‌కెక్కిస్తోన్న ల‌వ్ స్టోరీ ఇది. సినిమాలో బుజ్జి త‌ల్లి అనే పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి క‌నిపిస్తుంది. పాత్ర‌కనుగుణంగా ఉత్త‌రాంధ్ర యాస అవ‌స‌రం కావ‌డంతో ప‌ల్ల‌వి ఆ స్లాంగ్ ని నేర్చుకునే ప‌నిలో ఉందని తెలిసింది. ప్ర‌త్యేక‌మైన ట్రైన‌ర్ ని నియ‌మించుకుని నేర్చుకుంటుంది. తెలుగు కాని న‌టి ప్ర‌త్యేక‌మైన తెలియ‌ని స్లాంగ్ ని నేర్చుకోవ‌డం అంటే అంత ఈజీకాదు.

ఎంతో క‌మిట్ మెంట్..డెడికేష‌న్ ఉంటే త‌ప్ప సాధ్యం కాని ప‌న‌ది. గ‌తంలో 'ఫిదా' కోసం ఇలాగే సాయిప ల్ల‌వి తెలంగాణ స్లాంగ్ నేర్చుకుని తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పింది. అలాగే ముంబై బ్యూటీ కృతి శెట్టి కూడా ఓ సినిమా కోసం బెల్లీ డాన్స్ నేర్చుకుంటుందిట‌. కొన్ని త‌మిళ సినిమాల‌కు సైన్ చేసిన నేపథ్యం లో ఓ స్టార్ మేక‌ర్ డాన్సు త‌ప్ప‌ని స‌రిగా భావించ‌డంతో బెల్లీ డాన్సు క్లాస్ ల‌కు వెళ్తోందిట‌. అయితే ఆ సినిమా వివ‌రాలు మాత్రం అమ్మ‌డు గోప్యంగా ఉంచింది. ఇంకా మ‌రికొంత మంది భామ‌లు పాత్ర‌ల‌కు గ‌ణంగా స‌న్న‌దం అవుతున్నారు. అందుకోసం ఎన్నో ర‌కాల త్యాగాలు సైతం చేయాల్సి వ‌స్తోంది.