Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ రూల్స్ వెరీ టఫ్.. చెప్పిన యాంగిల్ లోనే కెమెరా పెట్టాలట!

కానీ, ఇప్పుడు సినిమా తెరకెక్కించే పద్ధతి పూర్తిగా మారిపోయింది. గ్రాఫిక్స్ వర్స్క్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువై పోయాయి.

By:  Tupaki Desk   |   10 July 2025 5:00 AM IST
ఆ హీరోయిన్ రూల్స్ వెరీ టఫ్.. చెప్పిన యాంగిల్ లోనే కెమెరా పెట్టాలట!
X

ఒకప్పుడు సినిమాల్లో అందంగా కనిపించేందుకు హీరోయిన్లు, ఫిట్ గా కనిపించేదుకు హీరోలు బాగా వర్కౌట్లు చేసేవారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే లావు అయిపోవద్దని డైట్ ఫుడ్ మాత్రమే తీసుకునేవాళ్లు. అటు హీరోలు కూడా అదే ఫాలో అయ్యేవాళ్లు. మరీ ముఖ్యంగా బికినీ షాట్స్ లో ఆకర్షనీయంగా కనిపించేందుకు హీరోయిన్లు రోజంతా ఆహారం కూడా తీసుకునేవాళ్లు కాదు.

గతంలో రామ్ చరణ్ - రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ధ్రువ సినిమాలో 'పరెషాను రా' పాటకు ఇదే జరిగింది. ఈ పాటలో బీచ్ ఒడ్డున రకుల్ ప్రీత్ బికినీ లో కనిపిస్తుంది. ఈ సమయంలో ఆమె పొట్ట బయటకు కనిపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుందట. స్లిమ్ గా కనిపించడం కోసం షూట్ జరిగిన రోజు ఆహారం తీసుకోకుండా, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుందట. అలానే ఆమె షూట్లో పాల్గొన్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ పాట కోసం రకుల్ అంతలా డెడికేషన్ చేసింది మరి.

కానీ, ఇప్పుడు సినిమా తెరకెక్కించే పద్ధతి పూర్తిగా మారిపోయింది. గ్రాఫిక్స్ వర్స్క్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువై పోయాయి. అందుకే ప్రస్తుతం హీరో, హీరోయిన్లకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. తాము ఎలా ఉన్నా కంప్యూటర్ గ్రాఫిక్స్ తో ఆకట్టుకునేలా డైరెక్టర్ చూసుకుంటారని ధీమాగా ఉంటున్నారు. వాళ్లు బరువు పెరగకూడదు, స్లిమ్ గా ఉండాలి అన్న ఆలోచనల్లో లేరు.

అయితే ఇది నిర్మాతలను అదనంగా చాలా ఖర్చు చేయిస్తుంది. అటు డైరెక్టర్ కు కూడా పని భారం పెరిగిపోతుంది. హీరో, హీరోయిన్లను బిగ్ స్క్రీన్పై స్లిమ్ గా, అందగా చూపించాలంటే వాళ్లకు తలనొప్పిగా మారుతోంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం, తనకు సంబంధించి గ్రాఫిక్ షాట్ ఔట్ పుట్ను తానే ఫైనలైజ్ చేస్తుందట. ఔట్ పుట్ లో ఏదైనా తేడా కొడితే, మళ్ళీ బాడీ కరెక్షన్ చేయాల్సిందేనట.

అంతే కాకుండా ఆమెను ఎలా చిత్రీకరించాలో హీరోయిన్ టీమ్ ముందే ఫొటోగ్రాఫర్, గ్రాఫిక్స్ టీమ్ కు స్పష్టంగా వివరిస్తుందట. వాళ్లు చెప్పిన యాంగిల్స్ లోనే కెమెరా పెట్టి షూట్ చేయాలన్నమాట. ఇలా అన్ని హీరోయిన్ టీమ్ చెప్పినట్లే జరగాలి. అయిచే ఇలా చేస్తే ఔట్ పుట్ బాగానే వస్తుంది. ఇందులో ప్లాబ్లమ్ ఏంటి? అని డౌట్ రావొచ్చు. అవును, అది నిజమే! కానీ ఇక్కడే ఉంది అసలు సమస్య. వాళ్ల చెప్పినట్లు ఫాలో అయితే అనుకున్న టైమ్ కు సినిమా పూర్తి అవ్వడం అసాధ్యం. ఇది రిలీజ్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది!