Begin typing your search above and press return to search.

20 సార్లు పెళ్లి చేసుకున్న హీరోయిన్

కానీ ఆ హీరోయిన్ మాత్రం ఏకంగా నాలుగు కాదు..ఆరు కాదు ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుంది? అంటే న‌మ్ము తారా? అంటే న‌మ్మాల్సిందే.

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:30 PM GMT
20 సార్లు పెళ్లి చేసుకున్న హీరోయిన్
X

ఏ హీరోయిన్ కైనా పెళ్లి స‌న్నివేశాలు అనేవి చాలా రేర్ గా ఉంటాయి. కెరీర్ మొత్తం చూసుకుంటే? మ‌హా అయితే నాలుగైదు ఉంటే ఎక్కువ‌. అందులోనూ ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ సినిమాల్లో పెళ్లి సీన్లు అనేవి పెద్ద‌గా ఉండ‌టం లేదు. ఫ్యామిలీ సినిమాలు త‌గ్గిపోవ‌డంతో? పెళ్లి తంతు స‌న్నివేశాలు బాగా త‌గ్గిపోయాయి. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఏకంగా నాలుగు కాదు..ఆరు కాదు ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుంది? అంటే న‌మ్ము తారా? అంటే న‌మ్మాల్సిందే.

ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్? 20 సార్లు పెళ్లి స‌న్నివేశాల్లే న‌టించే అంత ధైర్యం చేసిన భామ ఎవ‌రంటే? వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. అవికాగోర్ అలియాస్ చిన్నారి పెళ్లి కూతురు సుప‌రిచిత‌మే. ఆ సీనియ‌ర్ తోనే తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించింది అవికాగోర్. ప‌దేళ్ల వ‌య‌సులోనే చిన్నారి పెళ్లి కూతురు ధారావాహిక‌లో న‌టించింది. పెళ్లంటే ఏంటో తెలియ‌ని వ‌యసులోనే పెళ్లి కూతిరిలా చీర‌క‌ట్టుకుంది.

మెడ‌లో తాళి క‌ట్టించుకుంది. ఏడు అడుగులు వేసింది. అరుంధ‌తి న‌క్ష‌త్రం చూసింది. ఇలా ప‌దేళ్ల తెలియ‌ని వ‌య‌సులో మొద‌లైన పెళ్లి పాతికేళ్ల ప్రాయం వ‌చ్చినా పెళ్లి సీన్ల‌లో న‌టిస్తోంది. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత పెళ్లి కూతురు గెట‌ప్స్ లో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఈ స‌న్నివేశాల్ని ఉద్దేశించి అవికా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `పెళ్లి కూతురులా చీర‌క‌ట్టుకుని ప్ర‌త్యేకంగా ముస్తాబు కావ‌డం అంటే నాకెంతో ఇష్టం.

అందుకే ఇప్ప‌టివ‌ర‌కూ 20 సార్లు పెళ్లికూతిరిన‌య్యా. ఇంకా ఎన్నిసార్లు అయినా ఆ గెట‌ప్ వేస్తా. నాకెప్పుడు బోర్ కొట్ట‌ని రోల్ అది. ఇప్పుడు ఏకంగా `వ‌ధువు` టైటిల్ తోనే సినిమా చేసాను. ఇందులోనూ మ‌రోసారి పెళ్లి కూతురిన‌య్యా. ఇందులో అలంక‌ర‌ణ చూసి నాకు చిన్నారి పెళ్లి కూతురు గాముస్తాబైన విధానం గుర్తొచ్చింది. ఇవ‌న్నీ చూసి నా పేరెంట్స్ ఎంతో సంతోష ప‌డ‌తారు. చిన్న‌ప్పుడు వేసిన వేశం ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగిస్తున్నావా? అని ఆట ప‌ట్టిస్తుంటారు` అని తెలిపింది.