Begin typing your search above and press return to search.

కల్కి 2898AD : మళ్లీ లీక్ చేసిన హీరోయిన్‌

కల్కి పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   5 April 2024 12:59 PM GMT
కల్కి 2898AD : మళ్లీ లీక్ చేసిన హీరోయిన్‌
X

సలార్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అతి త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్కి పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


పాన్ వరల్డ్‌ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇప్పటి వరకు రివీల్‌ కాలేదు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ అని మాత్రం ప్రచారం జరిగింది. ఆ విషయం కూడా స్పష్టత లేదు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఏంటి అనే విషయంలో మేకర్స్ ఒక స్పష్టత ఇచ్చారు.


యూనిట్‌ సభ్యుల నుంచి కల్కి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ పెద్దగా లేవు. కానీ హీరోయిన్ దిశా పటానీ మాత్రం లీక్ ల మీద లీక్ లు ఇస్తుంది. ఇటీవల ఇటలీ లో షూటింగ్ కు వెళ్లిన సమయంలో అక్కడి ఫోటోలను షేర్‌ చేసింది. ఆ తర్వాత తిరిగి వచ్చేప్పుడు ఒక ఫోటోను షేర్‌ చేసింది.


ఇప్పుడు ప్రభాస్‌ తో కలిసి ఉన్న మరో ఫోటోను కూడా దిశా పటానీ షేర్‌ చేయడంతో అది వైరల్‌ అవుతోంది. కల్కి సినిమా లో దీపికా పదుకునే హీరోయిన్‌ గా నటిస్తూ ఉండగా దిశా పటానీ సెకండ్‌ హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాలో ఈ ఇద్దరు బాలీవుడ్‌ స్టార్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరియు యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే 9న విడుదల చేయాలని భావించినప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడు అనేది త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.