Begin typing your search above and press return to search.

వీడియో : ప్రియుడితో హీరోయిన్‌ బర్త్‌ డే వేడుక

ఆ పుట్టిన రోజు వేడుక కి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో ముద్దుగుమ్మ పంచుకుంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 8:20 AM GMT
వీడియో : ప్రియుడితో హీరోయిన్‌ బర్త్‌ డే వేడుక
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్‌ జనవరి 28న పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే. ఆ పుట్టిన రోజు వేడుక కి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో ముద్దుగుమ్మ పంచుకుంది.

నాకు ఇష్టమైన వారితో చాలా సంతోషంగా బర్త్‌ డే జరిగింది అంటూ శృతి హాసన్ ఈ వీడియోను షేర్ చేసింది. శృతి బర్త్‌ డే వేడుకలో తల్లి సారికతో పాటు సోదరి అక్షర హాసన్ ఇంకా ప్రియుడు శాంతను హజారికా పాల్గొన్నారు. వారితో పాటు శృతి హాసన్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా బర్త్‌ డే వేడుకలో పాల్గొన్నారు.

శృతి హాసన్‌ కు ఇష్టమైన బ్లాక్ కలర్ థీమ్‌ లోనే బర్త్‌ డే వేడుక జరిగింది. బర్త్‌ డే వేడుక చాలా వైభవంగా జరిగినట్లుగా వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఆమె నుదిటిపై పుర్రె ఆకారమును ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తానికి శృతి హాసన్‌ తాజా బర్త్‌ డే గతంతో పోల్చితే మరింత వైభవంగా జరిగింది.

ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సలార్‌ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తో కలిసి నటించింది. గత ఏడాది చివర్లో సలార్‌ తో పాటు నాని హాయ్‌ నాన్న సినిమాలో కూడా శృతి కనిపించింది.

ఈ ఏడాది లో కూడా పలు సినిమాలతో ఈ అమ్మడు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత తమిళ సినిమా ను చేయబోతుంది. వీర వనిత పాత్రలో శృతి హాసన్‌ ఆ తమిళ చిత్రం చేయబోతుందట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి అవ్వనున్నాయి.