Begin typing your search above and press return to search.

హీరోయిన్ బ్యూటీ ఫుల్ ప్రాక్టీస్.. మరో కప్ పక్కా!

తమిళనాడులో రీసెంట్ గా జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీల్లో నివేదా పేతురాజ్ విజేతగా నిలిచింది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 3:22 PM GMT
హీరోయిన్ బ్యూటీ ఫుల్ ప్రాక్టీస్.. మరో కప్ పక్కా!
X

కోలీవుడ్ నటి నివేదా పేతురాజ్.. తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్‌ ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత చిత్రలహరి, పాగల్, అల వైకుంఠపురములో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామకు సినిమాలే కాదు.. ఆటలన్నా కూడా ఇష్టమే. బ్యాడ్మింటన్ లో ఇటీవలే ఓ కప్పు కొట్టేసిన సంగతి తెలిసిందే.


తమిళనాడులో రీసెంట్ గా జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీల్లో నివేదా పేతురాజ్ విజేతగా నిలిచింది. మధురైకు ప్రాతినిథ్యం వహిస్తున్న నివేద.. మిక్స్‌ డ్‌ డబుల్స్‌ ఫైనల్ లో ప్రత్యర్థి జంటపై గెలిచి ఛాంపియన్‌ గా నిలిచింది. బెస్ట్ కోచ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ తో సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకుంది. ఇక వాట్ నెక్ట్స్? అంటూ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. నెక్ట్స్ మరో ఈవెంట్ లో కప్పు కొడతానని ఇన్ డైరెక్ట్ గా చెప్పిందని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.


తాజాగా నివేదా పేతురాజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్పోర్ట్స్ అవుట్ ఫిట్ వేసుకుని బ్యాడ్మింటన్ కోర్ట్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. బ్యాక్ టు ప్రాక్టీస్ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ పిక్ కు వేలల్లో లైకులు వచ్చిపడుతున్నాయి. త్వరలోనే ఈ అమ్మడు మరో కప్ కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ చెబుతున్నారు. గేమ్ ప్రాక్టీస్ చేస్తూనే చిరునవ్వుతో అదరగొట్టిందని అంటున్నారు.


మరోవైపు, సోషల్ మీడియాలో వరుస ఫొటో షూట్స్ తో సందడి చేస్తుంటుందీ అమ్మడు. మోడ్రన్ ఔట్ ఫిట్స్ తోపాటు చీరల్లో అందాలు ఆరబోస్తుంటుంది. తన లుక్స్ తో కుర్రకారు మతులు పోగుడుతోంది. ఇటీవలే సంక్రాంతి స్పెషల్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ, పింక్ బ్లౌజ్ తో దిగిన ఫొటోలను షేర్ చేసింది. అయితే నివేదా ఇప్పుడు అంతగా సినిమాల మీద ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపించడం లేదు.

శ్రీ విష్ణు మెంటల్ మదిలో సినిమాతో తెలుగు వాళ్లకు హీరోయిన్‍గా పరిచయమైంది నివేద. ఈ మూవీ తర్వాత బ్రోచెవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో సినిమాల్లో తళుక్కుమంది. రెడ్ మూవీలో పోలీస్‍ గా అలరించింది. విరాటపర్వంలో కీలక పాత్ర పోషించిన గ్లామర్ బ్యూటీ.. విశ్వక్ సేన్‍ తో పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాలతో ఆకట్టుకుంది. బ్లడీ మేరీ, బూ చిత్రాలతో ఓటీటీల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే నివేదతో స్పోర్ట్స్ డ్రామా ప్లాన్ చేయండని మేకర్స్ కు నెటిజన్లు సలహా ఇస్తున్నారు. మరి నివేదను ఆ జానర్ చిత్రాల్లో మేకర్స్ తీసుకుంటారో లేదో చూడాలి.