Begin typing your search above and press return to search.

పోస్ట‌ర్ టాక్: నాయ‌కి ఎదురు చూపులు ఎవ‌రి కోసం?

తాజాగా రిలీజ్ చేసిన కొత్త‌ పోస్ట‌ర్‌లో నాయ‌కి అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఒక అందమైన రాకుమారి న‌వ‌య‌వ్వ‌న శిరులు కెమెరా ముందు హొయ‌లు పోతున్న వైనం క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 3:34 AM GMT
పోస్ట‌ర్ టాక్: నాయ‌కి ఎదురు చూపులు ఎవ‌రి కోసం?
X

అందాల న‌టి దివ్య ఖోస్లా కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రేరణ అరోరా నిర్మిస్తున్న‌ 'హీరో హీరోయిన్‌' త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇటీవ‌లే దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్ విడుద‌లై ఆక‌ట్టుకుంది. ఇప్పుడు మ‌రో కొత్త లుక్ ని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్ లో దివ్య ముగ్ధ మ‌నోహ‌రంగా కనిపిస్తోంది. ఇది తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం. తెలుగు వెర్ష‌న్ కి 'నాయ‌కి' అనే టైటిల్ ని ప్ర‌క‌టించారు. పోస్ట‌ర్లు ఇప్ప‌టికే ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

తాజాగా రిలీజ్ చేసిన కొత్త‌ పోస్ట‌ర్‌లో నాయ‌కి అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఒక అందమైన రాకుమారి న‌వ‌య‌వ్వ‌న శిరులు కెమెరా ముందు హొయ‌లు పోతున్న వైనం క‌నిపిస్తోంది. బీచ్ పరిస‌రాల్లో ఒక రాయిపై కూచుని తీక్ష‌ణంగా ఎవ‌రి కోస‌మో ఎదురు చూపులు చూస్తున్న దివ్య సౌంద‌ర్యాన్ని చిత్రించేందుకు కెమెరా ట్ర‌య‌ల్ ప్యాడ్ ఫిక్స్ చేసి మ‌రీ ఉంచారు. ఇది చూడ‌గానే ఫోటోషూట్ కోసం ఏర్పాటు ఇది అని అర్థ‌మ‌వుతోంది. మొత్తానికి ఒక్క‌ పోటోగ్రాఫ్ ద్వారా 'నాయ‌కుని కోసం వేచి చూసే నాయ‌కి'గా దివ్య క‌నిపిస్తోంద‌ని అవ‌గ‌త‌మ‌వుతోంది. పోస్ట‌ర్లు, లుక్ లు ఆక‌ట్టుకుంటున్నాయి.

'అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో' అనే హిందీ చిత్రంతో ఆరంగేట్రం చేసిన దివ్య ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన జతకట్టింది. ఆ త‌ర్వాత‌ సత్యమేవ జయతేలో జాన్ అబ్రహం స‌ర‌స‌న న‌టించింది. ఇటీవ‌లే విడుద‌లైన 'యారియాన్ 2'లో చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. దివ్య ఖోస్లా కుమార్ నటిగానే కాకుండా దర్శకనిర్మాత‌గాను రాణించారు. యారియాన్, సనమ్ రే వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2004 లో ఉద‌య్ కిర‌ణ్ 'లవ్ టుడే' చిత్రంతో టాలీవుడ్ లో న‌టిగా ప‌రిచ‌య‌మైంది. ఆ తర్వాత హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. టి సిరీస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గాను దివ్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.