Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా.. క్రేజీ అప్డేట్..!

ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ హర్షతో భీమా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:20 AM GMT
ఆ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా.. క్రేజీ అప్డేట్..!
X

స్టార్ హీరో కేపబిలిటీ ఉండి పూర్తిగా అన్ లక్కీతో కెరీర్ లో వెనకబడ్డ హీరోల్లో గోపీచంద్ ఒకరు. హీరోగా విలన్ గా ఆయన తన మార్క్ సెట్ చేసుకోగా మాస్ సినిమాలే కాదు ఎంటర్టైనింగ్ సినిమాలు కూడా చేయాలని ఫిక్స్ అయిన గోపీచంద్ అలా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. కానీ అవి కూడా రొటీన్ గా అనిపించడంతో మళ్లీ తన పాత మాస్ ట్రాక్ ఎక్కగా వరుస ఫ్లాపులు పలకరించాయి. గోపీచంద్ లాస్ట్ మూవీ రామబాణం అయితే డిజాస్టర్ కా బాప్ అనే చెప్పొచ్చు. కథల సెలక్షన్ లో గోపీచంద్ సరైన నిర్ణయం తీసుకోలేక వరుస ఫ్లాపులతో కెరీర్ రిస్క్ లో పడేసుకున్నారు.

ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ హర్షతో భీమా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఓ పక్క భీమా అంటూ తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్న గోపీచంద్ మరోపక్క ఎంటర్టైనింగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. గోపీచంద్ శ్రీను వైట్ల అసలైతే ఈ కాంబో అంతకుముందు సినిమా చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు.

ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. కెరీర్ పరంగా డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా అసలేమాత్రం ఫాం లో లేడు. మంచు విష్ణుతో డీ సీక్వల్ ప్లాన్ చేసినా కుదరలేదు. తనకు ఛాన్స్ ఇచ్చే హీరో కోసం ఎదురుచూస్తున్న శ్రీ వైట్లకు గోపీచంద్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ నెల 9న ఈ సినిమా ముహుర్తం పెట్టుకుంటారని 20న సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఇటలీలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందని టాక్. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేసుకుని వస్తారని తెలుస్తుంది.

గోపీచంద్ మాస్ అంశాలు ఉంటూనే శ్రీ వైట్ల మార్క్ కామెడీ ఈ సినిమాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ హీరో ఇద్దరు హిట్ ఫాం లోకి వస్తారా లేదా అన్నది చూడాలి. గోపీచంద్ మాత్రం ఇక మీదట స్టోరీ సెలక్షన్ లో చాలా ఫోకస్ తో ఉండాలని ఫిక్స్ అయ్యాడు. భీమా ఆ తర్వాత శ్రీను వైట్ల మూవీ ఈ రెండు కెరీర్ ని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకెళ్లేలా చేయాలని కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు గోపీచంద్.