Begin typing your search above and press return to search.

వాళ్లు చేయాల్సిన కథలు వీరి చెంతకు..?

కానీ ఇప్పుడు అలాంటి మీడియం రేంజ్ కథలకు హీరోలు దొరకని పరిస్థితి అయ్యింది. స్టార్ హీరోలేమో కేవలం తెలుగు రిలీజ్ కాదు ఇక మీదట అన్నీ పాన్ ఇండియా సినిమాలే అనేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 2:30 AM GMT
వాళ్లు చేయాల్సిన కథలు వీరి చెంతకు..?
X

మొన్నటిదాకా ప్రాంతీయ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులు మహా అంటే పక్క రాష్ట్రాలైన తమిళ, కర్ణాటక ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన తెలుగు స్టార్స్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలంటూ సరికొత్త పంథా కొనసాగిస్తున్నారు. ప్రభాస్ తో మొదలైన ఈ పాన్ ఇండియా సినిమాల హవా అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, రవితేజ ఇలా అందరు నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. వారి మార్కెట్ పెరిగినందుకు సంతోషంగానే ఉన్నా వారు చేయాల్సిన కొన్ని కథలు మాత్రం వేరే హీరోల దగ్గరకు వెళ్తున్నాయన్న మాట అయితే వినిపిస్తుంది.

ఇదివరకు తెలుగు స్టార్స్ తో తెలుగు ఆడియన్స్ కోసమే ఒక కథ రాసుకుంటే దాని కోసం రెమ్యునరేషన్ మిగతా ఖర్చులు లెక్కేసుకుంటే మహా అంటే 60 నుంచి 80 కోట్ల దాకా అయ్యేది. సినిమా ఎలాగు బిజినెస్ 100 కోట్లు దాటేది కాబట్టి హ్యాపీగా పెట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటి మీడియం రేంజ్ కథలకు హీరోలు దొరకని పరిస్థితి అయ్యింది. స్టార్ హీరోలేమో కేవలం తెలుగు రిలీజ్ కాదు ఇక మీదట అన్నీ పాన్ ఇండియా సినిమాలే అనేస్తున్నారు.

పాన్ ఇండియా రిలీజ్ అంటే ఆ సినిమా బడ్జెట్ పెంచాల్సి వస్తుంది. కేవలం 80 కోట్ల బడ్జెట్ తో చేయాల్సిన సినిమా రిస్క్ తీసుకుని 150, 200 కోట్లు అలా తీస్తే తేడా వస్తే భారీ లాసులు భరించాల్సి వస్తుంది. అయితే దీనికి తరుణోపాయంగా పాన్ ఇండియా స్టార్స్ ని వదిలి టైర్ 2 హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మంచి కథ లిమిటెడ్ బడ్జెట్ లో స్టార్స్ తో చెప్పాలనుకున్న కొన్ని కథలను మీడియం రేంజ్ హీరోలతో కానిచ్చేస్తున్నారు.

ఈమధ్య రెండు మూడు ప్రాజెక్టులు అలానే సెట్స్ మీదకు వెళ్లాయని తెలుస్తుంది. టైర్ 2 హీరోలు కూడా ఏమంత ఖాళీగా లేరు. వారు కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. తమ రేంజ్ కి తగినట్టుగానే కథలు ఎంచుకుని మంచి బడ్జెట్ తోనే సినిమాలు చేస్తున్నారు. సో తెలుగు పరిశ్రమలో కాస్త టాలెంట్ ఉన్న ఏ హీరోగా కూడా కెరీర్ ఖాళీగా ఉంచుకోవట్లేదని చెప్పొచ్చు. ఫలితాలు కాస్త అటు ఇటుగా ఉన్నా మీడియం రేంజ్ హీరోలంతా కూడా క్యాలెండర్ మొత్తం బిజీ షెడ్యూల్ తో అదరగొట్టేస్తున్నారు. స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న టైం లో మీడియం రేంజ్ నిర్మాతలకు వీరే ఏకైక ఆప్షన్ అవుతున్నారు.