Begin typing your search above and press return to search.

అజిత్ సాహ‌సానికి హ్యాట్సాఫ్..ఇదెంత ప్ర‌మాద‌మంటే?

త‌ల అజిత్ హీరోగా న‌టిస్తోన్న `విదా మ‌యూర్చి` షూటింగ్ లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 April 2024 9:52 AM GMT
అజిత్ సాహ‌సానికి  హ్యాట్సాఫ్..ఇదెంత ప్ర‌మాద‌మంటే?
X

త‌ల అజిత్ హీరోగా న‌టిస్తోన్న `విదా మ‌యూర్చి` షూటింగ్ లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అజ‌ర్ బైజాన్ లో షూటింగ్ చేస్తుండ‌గా కారు అదుపు త‌ప్ప‌డంతో అజిత్ కి- ఆర‌వ్ లు చిన్న‌పాటి గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే అస‌లు ఏం జ‌రిగింది? యాక్సిడెంట్ ఎలా జ‌రిగింది? అన్న కార‌ణాలు మాత్రం బ‌ట‌య‌కురాలేదు. ఈ నేప‌థ్యంలో ఏకంగా ఆ కారు యాక్సిడెంట్ వీడియోనే లైకా ప్రొడ‌క్ష‌న్స్ సోష‌ల్ మీడియా షేర్ చేసి షాక్ ఇచ్చింది.

ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఓ సారి ఆ వీడియో సంగ‌తి చూస్తే... ఇది యాక్ష‌న్ స‌న్నివేశంలా ఉంది. ఇందులో అజిత్ బాడీ డ‌బుల్ లేకుండా కారుని ఎంతో వేగంగా న‌డుపుతున్నాడు. ఈ స‌మ‌యంలో కారు వేగానికి అదుపు త‌ప్పి రోడ్డుని దాటుకుని ప‌క్క‌నున్న గుంట‌లో బోల్తా ప‌డింది. ఆ స‌మ‌యంలో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది విజువ‌ల్స్ లో చూడొచ్చు. ప్ర‌మాదానికి గుర‌వుతోన్న స‌మ‌యంలో అజిత్..అర‌వ్ లు సీటు బెల్ట‌లు ధరించినా కుదుల‌కు అటు ఇటు వేగంగా ఊగ‌డం... వెంట‌నే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వ‌డం చూడొచ్చు.

ఈస‌న్నివేశం మొత్తాన్ని పై నుంచి డ్రోన్ కెమెరా క‌వ‌ర్ చేస్తూంది. కారు రన్నింగ్ మొత్తాన్ని ఆ కెమారా క‌వ‌ర్ చేస్తుంది. కారు బోల్తా కొట్ట‌గానే యూనిట్ స‌భ్యులు పరుగున వెళ్లి వెంట‌నే వాళ్ల‌ను కారులో నుంచి బ‌య‌ట‌కు తీసారు. అయితే ఇది షూటింగ్ లో భాగంగా కారు ప్ర‌మాదానికి గురైందా? లేక బ్రేక్ స‌మ‌యంలో ఇలా డ్రైవ్ చేస్తూ బోల్తా ప‌డిందా? అన్న‌ది తెలియ‌దు. అయితే అక్క‌డ స‌న్నివేశం చూస్తుంటే చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో కారు అదుపుత‌ప్పిన‌ట్లు క‌నిపిస్తుంది.

యాక్ష‌న్ స‌న్నివేశం కావ‌డంతో డ్రోన్ కారుని వెంబ‌డిస్తూ క‌వ‌ర్ చేసింది. అయితే ఇలాంటి సాహ‌సోపేత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు సాధార‌ణంగా బాడీ డ‌బుల్ తో చేస్తారు. నేరుగా స్టార్ హీరోలెవ్వ‌రు వాటిలో పాల్గొన‌రు. కానీ అజ‌ర్ బైజాన్ లో ఆఛాన్స్ అజిత్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. `ధైర్యానికి అవధులు లేవు. ఎలాంటి స్టంట్ డబుల్ లేకుండా సాహసోపేతమైన స్టంట్ సీక్వెన్స్ ఇది. అజిత్ కుమార్ అంకితభావానికి ఇదే నిద‌ర్శ‌నం` అంటూ లైకా ప్రొడక్షన్స్ పోస్ట్ చేసింది. ఈ చిత్రాన్ని మాజిద్ తిరుమేని దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా న‌టిస్తోంది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, ఆరవ్, రెజీనా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.