Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ ప్రయోగం.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం

సౌత్‌ లో ఒకప్పుడు పూర్తిగా హీరోల డామినేషన్‌ ఉండేది. కానీ మెల్ల మెల్లగా ఆ పోకడ మారుతోంది.

By:  Tupaki Desk   |   22 March 2024 7:11 AM GMT
హీరోయిన్స్ ప్రయోగం.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం
X

సౌత్‌ లో ఒకప్పుడు పూర్తిగా హీరోల డామినేషన్‌ ఉండేది. కానీ మెల్ల మెల్లగా ఆ పోకడ మారుతోంది. హీరోయిన్స్ కి మరియు దర్శకులకు కూడా ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో దూసుకు పోతున్నారు. హీరోల స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ పలువురు ఉన్నారు.

సౌత్ లో స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో ముందు ఉండే ముద్దుగుమ్మలు నయనతార, త్రిష, సమంత, కీర్తి సురేష్‌, అనుష్క ఇంకా కొందరు. వీరు కెరీర్‌ ఆరంభంలో హీరోల పక్కన గ్లామర్ డాల్ పాత్రల్లో కనిపించినా ఏదో ఒక సమయంలో ప్రయోగాత్మక సినిమాలు చేసి తమలోని నటిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు.

లేడీ ఓరియంటెడ్‌ సినిమా అనగానే గుర్తుకు వచ్చే పేరు నయనతార. అంతగా సినిమాలు చేసి ప్రయోగాత్మక సినిమాలను, పాత్రలను కూడా చేసిన నయనతార ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకుంది. ఆమె ఒకటి రెండు సినిమాలు మినహా ఎక్కువ శాతం సినిమాలు కమర్షియల్‌ విజయాలను సొంతం చేసుకున్నాయి.

సమంత కూడా ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఆ మధ్య యశోద మరియు శాకుంతలం అనే ప్రయోగాత్మక సినిమాలు చేసింది. అయిదే దురదృష్టం కొద్ది సమంతకు ఆ సినిమాలు హిట్ గా నిలువలేదు. కానీ ఆ రెండు సినిమాలు కూడా సామ్‌ కి మరింత క్రేజ్ ను పేరును తెచ్చి పెట్టాయి.

అనుష్క గ్లామర్‌ డాల్‌ నుంచి అరుంధతి సినిమాతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లోకి షిప్ట్‌ అయ్యింది. ఆ ప్రయోగాత్మక సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ప్రస్తుతం మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా తో అనుష్క రాబోతుందట.

ఇక కీర్తి సురేష్ కూడా పలు ప్రయోగాత్మక సినిమాల్లో నటించింది. వాటిల్లో మహానటి విజయాన్ని సొంతం చేసుకోగా మరి కొన్ని నిరాశ పరిచాయి. మరోసారి కామెడీ యంగ్‌ హీరో సుహాస్ తో కలిసి ఒక ప్రయోగాత్మక సినిమాను కీర్తి సురేష్‌ చేయబోతుంది. ఆ సినిమా పరిస్థితి ఏంటో చూడాలి.

త్రిష ఇంకా ఇతర హీరోయిన్స్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఇంకా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల విషయంలో పాజిటివ్ దృక్పథం తో ఉన్నట్లు అనిపించడం లేదు. కొన్ని సినిమాలకు మాత్రమే ఆధరణ కనిపిస్తుంది. ముందు ముందు అయినా ముద్దుగుమ్మల ప్రయోగాలకు జనాలు ఇష్టపడుతారేమో చూడాలి.