Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో కొడ‌తాం అంటోన్న భామ‌లు!

కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి భామా మ‌ణులంతా అడుగు పెట్ట‌డానికి రెడీ అవుతున్నారు. ముందొస్తు వేడుక‌లు గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 3:30 PM GMT
కొత్త ఏడాదిలో కొడ‌తాం అంటోన్న భామ‌లు!
X

కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి భామా మ‌ణులంతా అడుగు పెట్ట‌డానికి రెడీ అవుతున్నారు. ముందొస్తు వేడుక‌లు గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే వేగంగా భ‌విష్య‌త్ ఇలా ఉండాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అంతే కాన్పిడెంట్ గానూ క‌నిపిస్తున్నారు. యువ నాయిక‌లు శ్రీలీల‌...మీనాక్షి చౌద‌రి.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. శ్ర‌ద్దా శ్రీనాధ్ లాంటి భామ‌లు కొత్త ఏడాదిలో స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాది ఆరంభంలోనే ఆ భామా మ‌ణుల చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతుండ‌టంతో అంద‌రిలోనూ ఒక‌టే ఉత్కంఠ క‌నిపిస్తుంది.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `గుంటూరు కారం` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేష్ కి జోడీగా శ్రీలీల‌..మీనాక్షి చౌద‌రి న‌టిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా సినిమా రిలీజ్ అవుతుంది. శ్రీలీల‌..మీనాక్షి ఇద్ద‌రు విజ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. సాలిడ్ స‌క్సెస్ ఒక‌టి అవ‌స‌రం అంటూ ఇద్ద‌రు ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. మ‌హేష్ కం గురూజీ సినిమా కావ‌డంతో ఇన్ని హోప్స్ పెట్టుకున్నారు.

ఈ సినిమా విజ‌యంతో టాలీవుడ్ లో రేంజ్ మారుతుంద‌ని ఆశిస్తున్నారు. ఇక అనుప‌మ మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తోన్న `ఈగిల్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. `కార్తికేయ‌-2` త‌ర్వాత అమ్మ‌డికి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. దీంతో ఈసినిమాతో విజ‌యం ద‌క్కాల‌ని ఆశిస్తుంది. మ‌రోవైపు ర‌వితేజ ప్లాప్ ల ప‌రంప‌ర అంతే ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. ఇక శ్ర‌ద్దా శ్రీనాధ్ కి రెండు...మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత తెలుగు సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది.

అదే సైంధ‌వ్. ఇందులో అమ్మ‌డు వెంకటేష్ కి జోడీగా న‌టిస్తోంది. ఇంకా కొంత మందిహీరోయిన్లు ఉన్నా! శ్ర‌ద్దా పాత్ర‌కి వెయిట్ క‌నిపిస్తోంది. అలాగే సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. వెంకీ తొలి పాన్ ఇండియా సినిమా కావ‌డంతో హిట్ అందుకుంటే? పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన‌ట్లేన‌ని శ్ర‌ద్దా భావిస్తోంది. పొంగ‌ల్ రిలీజ్ నేప‌థ్యంలో స‌క్సెస్ కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోంది.