సంచలన నటుడిపై స్టార్ హీరో లీగల్ యాక్షన్!
బాలీవుడ్ సిరీస్ `హేరాపేరి -3` కి ఎన్ని కష్టాలొచ్చాయన్నది చెప్పాల్సిన పనిలేదు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, సునీల్ శెట్టి త్రయంలో ప్రారంభమైన ప్రాజెక్ట్ రకరకాల సవాళ్లను ఎదుర్కుంటుంది.
By: Tupaki Desk | 23 Jun 2025 5:25 PM ISTబాలీవుడ్ సిరీస్ `హేరాపేరి -3` కి ఎన్ని కష్టాలొచ్చాయన్నది చెప్పాల్సిన పనిలేదు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, సునీల్ శెట్టి త్రయంలో ప్రారంభమైన ప్రాజెక్ట్ రకరకాల సవాళ్లను ఎదుర్కుంటుంది. ఏ మూహూ ర్తాన మొదలు పెట్టారో గానీ ఇప్పటివరకూ అది రిలీజ్ కాలేదు. హేరాపేరి మొదలవ్వగానే దర్శకుడు నీరజ్ వోరా చనిపోవడంతో తాత్కాలికంగా ఆగిపోయింది. అటుపై ఈ ప్రాజెక్ట్ లోకి 2018 లో డైరెక్టర్ గా ఇంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చాడు.
అన్ని పనులు పూర్తి చేసి 2019లో విడుదల చేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. కానీ అనూహ్యంగా ప్రాజె క్ట్ నుంచి ఇంద్ర కుమార్ తప్పుకున్నారు. దీంతో మొదటి పార్ట్‌కి దర్శకత్వం వహించిన ప్రియదర్శన్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిర్మాత తప్పుకున్నాడు. దీంతో ఆ ప్రాజెక్ట్ రైట్స్ ను భారీ ధరకు అక్షయ్ కుమార్ తీసుకున్నాడు. అయితే ఈసారి పరేష్ రావల్ రూపంలో ఎటాక్ ఎదురైంది.
అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి పరేష్ రావల్ తప్పుకున్నాడు. అందుకు ఎలాంటి కారణాలు రివీల్ చేయ లేదు. ప్రియదర్శన్ తో తనకి ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఆయనంటే? తనకి ఎంతో గౌరవం ఉందన్నారు. ఈ విషయం తెలియగానే అక్షయ్ ఎంతో బాధపడ్డాడు. పరేష్ ఎందుకిలా చేస్తున్నాడు ప్రియన్ అంటూ బాధపడ్డాడు. పరేష్ రావల్ ని తిరిగి తీసుకురావాలని అక్షయ్ ఎంతో ప్రయత్నించాడు. కానీ అందుకు అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. పరేష్ రావల్ ప్రవర్తపై కోర్టులో దావా వేసారు. అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ లేబుల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జాయింట్ మేనేజింగ్ పార్టనర్ పూజా టిడ్కే స్పందించారు. మధ్యలో వెళ్లిపోవడం వల్ల తాము నష్టాలను భరించాల్సి వస్తుందన్నారు. చట్టపరమైన చర్యలుంటాయన్నారు. ఇలా వెళ్లిపోవడం అన్నది ప్రాంచైజీకి హాని కలిగించేదిగా భావించారు.
