బాబూరావు లేకపోతే ఎలా.. పరేష్‌ని నిలదీసిన నెటిజన్
హేరా ఫేరి ఫ్రాంఛైజీ లో పార్ట్ 3 ప్రకటన వెలువడినప్పటి నుంచి అభిమానుల్లో చాలా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 10 Jun 2025 10:49 PM ISTహేరా ఫేరి ఫ్రాంఛైజీ లో పార్ట్ 3 ప్రకటన వెలువడినప్పటి నుంచి అభిమానుల్లో చాలా చర్చ సాగుతోంది. ప్రతిష్ఠాత్మక `హేరా ఫేరి 3` నుంచి బాబూరావు పాత్రధారి అయిన పరేష్ రావల్ తప్పుకుంటున్నానని ప్రకటించడం కలకలం రేపింది. అతడి నిర్ణయం తన సంస్థకు తీవ్ర నష్టం కలిగించిందని నిర్మాత అక్షయ్ కుమార్ అతడిపై కోర్టును ఆశ్రయించాడు.
అయినా పరేష్ రావల్ ఇప్పటికీ తన మొండి పట్టు వీడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరేష్ రావల్ ని ఒక అభిమాని సోషల్ మీడియాలో ఇలా ప్రశ్నించాడు. హేరాఫేరి 3 నుండి తప్పుకోవాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని పరేష్ రావల్ ని ఒక అభిమాని కోరారు. ఆయనను హేరాఫేరి సిరీస్ కి హీరో అని కూడా ప్రశంసించారు. దీనికి పరేష్ ప్రతిస్పందిస్తూ..``సినిమాలో ముగ్గురు హీరోలు`` ఉన్నారని అన్నారు. పరేష్ ఇంకా తన నిర్ణయం మార్చుకోలేదు. కానీ పరేష్ రావల్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి ప్రాముఖ్యతను సూక్ష్మంగా అంగీకరించారు.
అక్షయ్ కుమార్ , సునీల్ శెట్టి హేరా ఫేరీ 3 లో తమ పాత్రలను తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉండగా, పరేష్ రావల్ స్థానంలో బాబూరావుగా ఎవరు చేరతారో ఇంకా స్పష్టత లేదు. పరేష్ ఇప్పటికే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. హేరా ఫేరీ 3 నుండి తప్పుకున్నందుకు అక్షయ్ నిర్మాణ సంస్థ రావల్ పై రూ. 25 కోట్లకు దావా వేయగా, పరేష్ రావల్ కూడా అక్షయ్ కు ధీటుగా చట్టపరంగా స్పందించాడు.
హేరా ఫేరీ 3 నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ పరేష్ రావల్ కు రూ. 11 లక్షల అడ్వాన్స్ అందించగా, ఆ మొత్తాన్ని అతడు వడ్డీ సహా తిరిగి చెల్లించానని తెలిపాడు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అక్షయ్- సునీల్ శెట్టిలతో టీజర్ చిత్రీకరించారు. ఇది త్వరలో విడుదల కానుంది. `హేరా ఫేరి 3` షూటింగ్ 2026లో ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ప్రోమో మాత్రమే చిత్రీకరించారని సమాచారం.