Begin typing your search above and press return to search.

అసత్య ప్రచారాలపై హేమ కౌంటర్.. ఆ నటికి లీగల్ నోటీసులు!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో గుర్తింపు పొందిన ప్రముఖ నటి హేమ, ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   7 April 2025 1:10 PM IST
అసత్య ప్రచారాలపై హేమ కౌంటర్.. ఆ నటికి లీగల్ నోటీసులు!
X

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో గుర్తింపు పొందిన ప్రముఖ నటి హేమ, ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ యూట్యూబ్ వ్లాగర్లపై లీగల్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నోటీసుల్లో కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి, ఇతర కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పేర్లు ఉన్నట్లు సమాచారం.

హేమ లాయర్ ద్వారా పంపిన ఈ నోటీసుల్లో, అసత్యమైన ఆరోపణలు చేశారని, వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అంటూ అంటూ స్పష్టంగా పేర్కొంది. ఇది విన్న తరువాత కరాటే కళ్యాణి ఏ విధంగా స్పందిస్తుందో అన్న ఆసక్తి ఎక్కువవుతోంది. గత ఏడాది హేమ బెంగళూరులో జరిగిన ఓ వివాదస్పద పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే పోలీసులు విచారణను కూడా ఆమె ఎదుర్కొన్నారు.

ఇక అప్పట్లో ఆ కేసుకు సంబంధించి అనేక రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే టెస్టుల్లో నెగటివ్ రిపోర్ట్ రావడంతో వెంటనే బెయిల్‌పై విడుదల అయ్యారు. కానీ ఈ వ్యవహారంపై ఆ తర్వాత అనేక యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా పేజీలు తప్పుడు కథనాలతో ఆమెను టార్గెట్ చేశాయని హేమ అంటున్నారు. ప్రస్తుతం హేమ ఈ ప్రచారాలతో విసిగిపోయి, చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నా విలువను కించపరచేలా మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ఆ విషయంలో చట్టమే నన్ను రక్షిస్తుంది అంటూ గతంలో హేమ హెచ్చరించారు. అయితే కరాటే కళ్యాణి ఇప్పటికే కొన్ని వివాదాలకు సంబంధించి సోషల్ మీడియాలో తన దూకుడు చూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హేమ నుంచి నోటీసులు రావడంతో ఆమె ఎలా స్పందిస్తుందో అని సినీ పరిశ్రమ వర్గాలు గమనిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, హేమకు ఈ కేసు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఆమె న్యాయస్థానం ద్వారా ఈ ఆరోపణలపై సీరియస్‌గా వెళ్ళాలని భావిస్తుండగా, ఇది కేవలం మొదటిదశ మాత్రమే అని సమాచారం. ఇక నోటీసులు అందుకున్న వారు క్షమాపణలు చెబుతారా లేక న్యాయపోరాటానికి సిద్ధమవుతారా అన్నది చూడాలి.