Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో అయినా నాకేం ప‌ర్వాలేద‌న్నాడు!

బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం నిత్యం చ‌ర్చ‌కొచ్చేది. లైంగిక వేధింపుల‌పై చాలా మంది న‌టీమ‌ణులు బ‌హిరంగంగానే మాట్లాడారు.

By:  Tupaki Desk   |   5 July 2025 1:00 AM IST
ఆన్ లైన్ లో అయినా నాకేం ప‌ర్వాలేద‌న్నాడు!
X

బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం నిత్యం చ‌ర్చ‌కొచ్చేది. లైంగిక వేధింపుల‌పై చాలా మంది న‌టీమ‌ణులు బ‌హిరంగంగానే మాట్లాడారు. దీనిపై మీటూ ఉద్య‌మానికి తెర తీసారు. ఆ త‌ర్వాత ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో కూడా ఇలాంటి బాగోతాలెన్నో బ‌య‌ట‌కొచ్చాయి. ఆ మ‌ద్య మాలీవుడ్ కూడా ఇలాంటి కోర‌ల్లో చిక్కుకుంద‌న్న విష‌యం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. చెప్పుకొవ‌డానికి చిన్న ప‌రిశ్ర‌మైనా లైంగిక దోపీడీ ఆ స్థాయిలో జ‌రిగిందా? అని దేశ‌మే ఆశ్చ‌ర్య‌పోయింది.

ఇలాంటి ప‌రిస్థితులు ఓటీటీ లో అవ‌కాశాల కోసం వ‌స్తోన్న వారికి ఎదురవుతున్నాయ‌ని తెలుస్తోంది. తాజాగా న‌టి హెల్లీ షా కు ఓ వెబ్ సిరీస్ లో అవ‌కాశం రావ‌డంతో వెళ్లి క‌లిసిందిట‌. కానీ తాము పెట్టిన కండీష‌న్లు అన్నింటికి ఒకే అంటేనే ఛాన్స్ లేక‌పోతే లేద‌న్నారుట‌. తాము చెప్పిన ప్ర‌దేశానికి రావాల‌ని అడిగారుట‌. వ‌చ్చిన త‌ర్వాత తాము చెప్పిన‌ట్లు చేయాలన్నారుట‌. అందుకు ఒకే అయితే ఈ అవ‌కాశం మీదే అని చెప్పారుట‌. దీంతో విష‌యం అర్దమైన హెల్లీ షా ఈ అవ‌కాశం నా కొద్దు మ‌రో న‌టిని వెతుక్కోమ‌ని చెప్పిందిట‌.

దీంతో హెల్లీషా కు మ‌రో ఆఫ‌ర్ ఇచ్చారుట‌. మీరు చెప్పిన ప్ర‌దేశానికి రాక‌పోయినా ప‌ర్వాలేదు. తాము చెప్పింది చేస్తే చాలు. అది ఆన్ లైన్ లో అయినా ప‌ర్వాలేదన్నారుట‌. ఆ స‌మ‌యంలో వాళ్లు అన్న మాట‌ల‌ను నోటితో చెప్ప‌లేక‌పోతున్నాన‌ని వాపోయింది. దీంతో అక్క‌డ నుంచి వెళ్లిపోయి వాళ్ల కాంటాక్ట్ నెంబ‌ర్లన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన‌ట్లు తెలిపింది. అవ‌కాశం పేరుతో ఇలాంటి దాడుల‌కు తెగ బ‌డుతున్న వారిని కఠినంగా శిక్షించాల‌ని మండిప‌డింది.

ప్రస్తుతం హెల్లీ షా గుజ‌రాతీలో `ద‌డే` అనే సినిమా చేస్తోంది. ఇందులో అమ్మ‌డు గ‌ర్భ‌వ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. హెల్లీ షా `హ్యాపీ బ‌ర్త్ డే` చిత్రంతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. అటుపై అవకాశాలు రాక‌పోవ‌డంతో గుజ‌రాతీకి వెళ్లిపోయింది. మూడేళ్ల‌గా అక్క‌డే సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా మ‌ళ్లీ బాలీ వుడ్ లో `క్యా ప‌ల‌త్` అనే సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌లే ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది.