Begin typing your search above and press return to search.

చిరుని చూసి సిగరెట్ నేర్చుకున్నాడట..!

అయితే కొందరు కేవలం సినిమా మీద ప్యాషన్ తో అలా వచ్చేయగా కొందరు ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసి ఇటు వైపు వచ్చారు

By:  Tupaki Desk   |   2 Jan 2024 6:00 AM GMT
చిరుని చూసి సిగరెట్ నేర్చుకున్నాడట..!
X

ఈ తరం హీరోలే కాదు చాలామంది దర్శకులు కూడా మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తిగా తీసుకున్న వారే అని తెలిసిందే. మెగాస్టార్ ని చూసి ఇన్ స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే కొందరు కేవలం సినిమా మీద ప్యాషన్ తో అలా వచ్చేయగా కొందరు ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసి ఇటు వైపు వచ్చారు. అలాంటి వారిలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒకరు. అతను చేసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ 3 సినిమాలు డైరెక్టర్ గా అతని స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాయి.

సందీప్ వంగ సినిమాలు రిలీజ్ డే కొంత నెగిటివిటీ తెచ్చుకున్నా ఫైనల్ గా అతని ఐడియాలజీ గెలుస్తుంది. యానిమల్ సినిమా విక్టరీతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చాటాడు సందీప్ రెడ్డి వంగ. దాదాపు బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల చేరువలో యానిమల్ ఉంది. ఇదిలాఉంటే రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ వంగ మరోసారి తన మెగా ఫేవరిజాన్ని చూపించాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మీద సందీప్ వంగా కి ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది. ఆల్రెడీ అతని ఓల్డ్ ట్వీట్స్ చూస్తే అది అర్థమవుతుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో సందీప్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రభావం తన మీద ఎంతగా ఉంది అన్న దాని గురించి మాట్లాడిన సందీప్ వంగ మాస్టర్ సినిమాలో చిరంజీవి వేసుకున్న షర్ట్ కలర్, ఆ టైం లో చిరు సిగరెట్ తాగే స్టైల్ గురించి ప్రస్తావించారు. మాస్టర్ సినిమా లో హీరోయిన్ సాక్షి శివానంద్ తనని ప్రేమించమని చిరంజీవి వెంట పడుతుంది. ఆ టైం లో చిరు ఆమెకు క్లాస్ తీసుకుంటాడు. సిగరెట్ తాగుతూ అసలు నా గురించి నీకేం తెలుసని అంటాడు. ఆ టైం లో చిరంజీవి గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు.. ఆ సీన్ తనకు బాగా కనెక్ట్ అయ్యిందని అన్నారు. చిరు సిగరెట్ తాగే విధానం బాగా ఎక్కేసి దాన్ని అలవాటుగా చేసుకున్నానని అన్నారు సందీప్ వంగ.

ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో చిరు షర్ట్ కలర్ కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడటం అంటే అది మామూలు విషయం కాదు. మెగా వీరాభిమాని అయిన సందీప్ వంగ అంత పరిశీలన ఉంది కాబట్టే అతను డైరెక్టర్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక తన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సందీప్ వంగ యానిమల్ లో రణ్ బీర్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో చేస్తున్నాడు. స్పిరిట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.