Begin typing your search above and press return to search.

సూసైడ్ అంటూ న‌టి వీడియో..అత‌డే నా చావుకి కార‌ణం!

వివ‌రాల్లోకి వెళ్తే కోలీవుడ్ సినిమాలో న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకున్న విజ‌య‌ల‌క్ష్మి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచిత‌మే.

By:  Tupaki Desk   |   6 March 2024 9:21 AM GMT
సూసైడ్ అంటూ న‌టి వీడియో..అత‌డే నా చావుకి కార‌ణం!
X

న‌టి విజ‌య‌ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య‌చేసుకుంటానంటూ ఓ సంచ‌ల‌న వీడియో పోస్ట్ చేసింది. మోసం చేసి ఒంట‌రిదాన్ని చేసాడు..న‌మ్మించి వంచించాడు. ఇప్పుడు బ్ర‌త‌క‌లేక‌పోతున్నాను. ఇదే నా చివ‌రి వీడియో అంటూ విజ‌యల‌క్ష్మి పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే కోలీవుడ్ సినిమాలో న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకున్న విజ‌య‌ల‌క్ష్మి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచిత‌మే.

అర్జున్ -జ‌గ‌ప‌తి బాబు హీరోల‌గా న‌టించిన `హనుమాన్ జంక్ష‌న్` చిత్రంలో హీరోలిద్ద‌రికి చెల్లెలి పాత్ర‌తో విజ‌య్ ల‌క్ష్మి ఎంతో ఫేమ‌స్ అయింది. అందులో హీరోయిన్ల కంటే బ‌ల‌మైన పాత్ర పోషించ‌డంతో ఆమెకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. ఆ స‌క్సెస్ తో మరిన్ని తెలుగు చిత్రాల్లో న‌టించింది. అయితే ఇప్పుడామె వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదుర్కోంటున్న సంఘ‌ట‌న‌లతో మ‌న‌స్తాపం చెంది ఓ వీడియో రిలీజ్ చేసింది.

అందులో ఆమె మాట్లాడుతూ.. `మీడియా మిత్రులకు నా నమస్కారం.. ఫిబ్రవరి 29న నేను ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ నాతో మాట్లా డాలని ఆయన నాతో కలిసి జీవించాలని కోరాను. కానీ నాకు ఎలాంటి స్పందన రాలేదు. నేను ఎంతో బాధపడ్డాను, ఏడుస్తూ అతనికి ఓ వీడియోను పంపాను.

నువ్వు కావాలి.. నువ్వు లేకుంటే చచ్చిపోతా అని చెప్పను కానీ అతను పట్టించుకోలేదు. నన్ను పెళ్లి చేసుకొని సీక్రెట్ గా ఉంచి.. నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదు అని రోడ్డున పడేశాడు. నాకు ఎవ్వరూ సాయం చేయడం లేదు కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను కర్ణాటకలో బ్రతకలే కపోతునాన్ను. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఇదే నా చివరి వీడియో..నా చావు పై సీమాన్ వివరణ ఇవ్వాలి అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.