Begin typing your search above and press return to search.

నితిన్ ని లేపుతాడా ?

ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ యూత్ స్టార్ ని పైకి లేపాల్సిన బాధ్య‌త వెంకీ కుడుముల పైనే ఉంద‌ని క్లియ‌ర్ గా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 5:30 PM GMT
నితిన్ ని లేపుతాడా ?
X

యూత్ స్టార్ నితిన్ మ‌ళ్లీ ట్రాక్ త‌ప్పిన సంగ‌తి తెలిసిందే. 'భీష్మ` త‌ర్వాత వ‌రుస‌గా చేసిన ఐదు సినిమా లు డిజాస్ట‌ర్ల‌గానే తేలాయి. చెక్..రంగ్ దే..మ్యాస్ట్రో..మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం..ఎక్స్ ట్రా ఆర్డీన‌రీ మ్యాన్ ఇలా అన్ని ఒక‌దానికొక‌టి పోటీ మ‌రీ ప్లాప్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ యూత్ స్టార్ ని పైకి లేపాల్సిన బాధ్య‌త వెంకీ కుడుముల పైనే ఉంద‌ని క్లియ‌ర్ గా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో 'రాబిన్ హుడ్` అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే 'త‌మ్ముడు` టైటిల్ తో మ‌రో సినిమా చేస్తున్నాడు. త‌మ్ముడు సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అభిమానుల ఆశ‌లన్నీ 'రాబిన్ హుడ్` పైనే ఉన్నాయి. ఇంత‌వ‌ర‌కూ వెంకీ కుడుమ‌ల‌కి ప్లాప్ లేదు. అత‌ను డైరెక్ట‌ర్ చేసిన సినిమాల‌న్నీ మంచి విజ‌యాలు సాధించాయి. ఈ క్ర‌మంలోనే నితిన్ కి కూడా ప్లాప్ ల్లో ఉన్న‌ప్పుడు `భీష్మ‌`తో స‌క్సెస్ ఇచ్చి మ‌ళ్లీ మార్కెట్ లో పుంజుకునేలా చేసాడు. కానీ ఆ వేగాన్ని నితిన్ కొన‌సాగించ లేక‌పోయాడు.

మ‌ళ్లీ ఇప్పుడు అదే ప‌రిస్థితి ఎదురైన నేప‌థ్యంలో భీష్మ త‌ర‌హాలోనే రాబిన్ హుడ్ ని హిట్ చేసి నితిన్ ని పైకి లేపాలి వెంకీ. ప్ర‌స్తుతం ఆ ద్వ‌యం ఆ ప‌నిలోనే బిజీగా ఉంది. ఈ సినిమాని కూడా వీలైనంత వేగంగా పూర్తి చేసి తీసుకురావాలి. ఇప్ప‌టికే ప్లాప్ ల నేప‌థ్యంలో నితిన్ మార్కెట్ బాగా డౌన్ గా ఉంది. త‌దుప‌రి సినిమా ద‌ర్శ‌కుడి బ్రాండ్ మీద వెళ్లాలి. ఆ ర‌కంగా రాబిన్ హుడ్ వ‌రకూ ఇబ్బంది ఉండ‌దు.

వెంకీ సినిమాల‌కు మార్కెట్ లో డిమాండ్ బాగానే ఉంటుంది..కాబ‌ట్టి అతని పేరుతో సినిమా వెళ్లిపోతుంది. ఆ త‌ర్వాత నితిన్ స‌త్తా చాటాల్సిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయ‌న గ్లింప్స్ ప్రేక్ష‌కుల్ని బాగానే ఎంగేజ్ చేస్తు న్నాయి. ఇక నితిన్ 'త‌మ్మ‌డు` చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా టైటిల్ కావ‌డంతో క్రేజ్ బాగానే క్రియేట్ అవుతుంది. మ‌రి కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.