Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం ఆయన వద్ద టైం లేదట...!

ఆయనతో పాన్‌ ఇండియా సినిమా చేసి తమ పాన్‌ ఇండియా స్టార్‌ డమ్ ను నిరూపించుకునేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   27 March 2024 7:30 AM GMT
ప్రభాస్ కోసం ఆయన వద్ద టైం లేదట...!
X

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అన్నట్లుగా సౌత్ మరియు నార్త్‌ కి చెందిన స్టార్‌ దర్శకులు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాన్‌ ఇండియా సినిమా చేసి తమ పాన్‌ ఇండియా స్టార్‌ డమ్ ను నిరూపించుకునేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తుంటారు.

ఎంతో మంది ప్రభాస్‌ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈ సమయంలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం.. ప్రభాస్‌ తో సినిమాకు తన వద్ద సమయం లేదు అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారితో చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రభాస్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్‌ కనగరాజ్ తో చర్చలు జరిపారు. కానీ ముందుగానే కమిట్ అయ్యి ఉన్న సినిమాల కారణంగా ప్రభాస్ తో సినిమాకు ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన అన్నాడట.

ప్రభాస్ అంటే తనకు అభిమానం అంటూనే ఇప్పటికే రజినీకాంత్‌ మూవీ తో పాటు ఖైదీ 2, విక్రమ్‌ 2 మరియు లియో సీక్వెల్స్ ను చేయాల్సి ఉండగా ఆయనతో సినిమాను చేయలేక పోతున్నట్లు లోకేష్ కనగరాజ్ తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడని సమాచారం అందుతోంది.

మరో వైపు ప్రభాస్‌ కూడా చాలా బిజీగా ఉన్నాడు. ఒక వేళ లోకేష్ కనగరాజ్ సిద్ధంగా ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం కల్కి, రాజా సాబ్‌, సలార్‌ 2, హను రాఘవపూడి మూవీ ఇలా చాలా సినిమాలను లైన్ లో పెట్టాడు కనుక కాస్త సమయం అడిగే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు... కనుక రాబోయే రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా వీరి కాంబో మూవీ ఉంటుందేమో చూడాలి.