Begin typing your search above and press return to search.

భన్సాలి హీరామండి టాక్ ఏంటి..?

బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలి అంటే ఒక సెపరేట్ బ్రాండ్ ఉంది. ఆయన చేసిన సినిమాలు బీ టౌన్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి

By:  Tupaki Desk   |   3 May 2024 6:52 AM GMT
భన్సాలి హీరామండి టాక్ ఏంటి..?
X

బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలి అంటే ఒక సెపరేట్ బ్రాండ్ ఉంది. ఆయన చేసిన సినిమాలు బీ టౌన్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంచుకున్న కథను అదే రేంజ్ లో తీస్తూ తన ప్రత్యేకత చాటుతూ వస్తున్నాడు. దేశం మెచ్చే దర్శకుల లిస్ట్ లో సంజయ్ లీలా భన్సాలి పేరు కచ్చితంగా ఉంటుంది. ఆయన చేసిన హం దిల్ చుకే, దేవదాస్, పద్మావత్, బాజీరావు మస్తాని, గంగూబాయి కతియావాడి సినిమాలు చూస్తే ఆయన డైరెక్షన్ టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. అలాంటి క్రేజీ డైరెక్టర్ ఓటీటీ డిబట్ గా చేసిన ప్రాజెక్ట్ హీరామండి. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ వెబ్ సీరీస్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సీరీస్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్.. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ ఇవన్నీ హీరామండీ మీద అంచనాలు పెంచాయి. అయితే రీసెంట్ గా రిలీజైన ఈ వెబ్ సీరీస్ చూసిన ఆడియన్స్ ఆశించిన స్థాయిలో లేదని పెదవి విరుస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ పెట్టిన భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హీరామండి తో ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యారు సంజయ్ లీలా భన్సాలి.

ఇంతకీ హీరామండి కథ ఏంటి అంటే.. స్వతంత్రానికి ముందు బ్రిటీష్ పాలనలో లాహోర్ లో వేశ్యలు ఉండే హీరామండిలో షాహి మహల్ లో పెద్ద దిక్కుగా మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) ఉంటుంది. మల్లికా జాన్ కూతుళ్లు ఇద్దరితో పాటు ఆమె కూడా నవాబులను సంతృప్తి పరచి బాగా సంపాదిస్తుంది. అయితే చిన్న కూతురు షర్మీన్ సెగల్ దొర కొడుకుని ప్రేమించడం తో వారి శతృవు ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది హీరామండి వెబ్ సీరీస్ కథ.

సంజయ్ లీలా భన్సాలి సినిమాల్లో ఉండే గ్రాండియర్ కు ఏమాత్రం తగ్గకుండానే హీరామండి ఉంటుంది. కానీ ఆయన సినిమాల్లో ఉండే మ్యాజిక్ మాత్రం ఈ వెబ్ సీరీస్ లో కనిపించలేదు. హీరామండి సీరీస్ కు అదే పెద్ద లోటుగా కనిపిస్తుంది. సంజయ్ లీలా భన్సాలి డీటైల్డ్ న్యారేషన్ వల్ల సీరీస్ అక్కడక్కడ బోర్ కొట్టేస్తుంది. అయితే పాత్రలకు కనెక్ట్ అయిన వారికి సీరీస్ ఏమన్నా నచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ మిగతా వారికి పెద్దగా రుచించదు. సీరీస్ కి పెట్టిన ప్రతి పైసా తెర మీద కనిపిస్తుంది. ఈమధ్య కాలంలో వచ్చిన బిగ్ బడ్జెట్ వెబ్ సీరీస్ గా హీరామండి గురించి చెప్పొచ్చు. అయితే సీరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ ఉండటం కథనం అంత గొప్పగా లేకపోవడం వల్ల డిజిటల్ ఆడియన్స్ మెప్పు పొందే ఛాన్స్ లేదు. సంజయ్ లీలా భన్సాలి సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ ఈ సీరీస్ ఒకసారి చూసే అవకాశం ఉంటుంది.