తమిళ స్టార్ హీరో పై హీరా రాజగోపాల్ తీవ్ర ఆరోపణలు
ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండే అజిత్ తాజాగా పద్మభూషణ్ అందుకునే టైమ్ లో ఆయనపై ఒకరు వివాదాస్పద ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 29 April 2025 5:09 AMతమిళ స్టార్ హీరో అజిత్ కు దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారనే విషయం తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ రీసెంట్ గానే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండే అజిత్ తాజాగా పద్మభూషణ్ అందుకునే టైమ్ లో ఆయనపై ఒకరు వివాదాస్పద ఆరోపణలు చేశారు.
అది మరెవరో కాదు, అజిత్ తో కలిసి ప్రేమ లేఖ సినిమాలో నటించిన హీరా రాజగోపాల్. ఆ సినిమా టైమ్ లోనే వారిద్దరి మధ్య ప్రేమ కుదిరి ఇద్దరూ కొన్నాళ్లపాటూ రిలేషన్‌లో కూడా ఉన్నారు కానీ తర్వాత ఇద్దరూ విడిపోగా అజిత్, షాలినీ ని పెళ్లి చేసుకుని తన పర్సనల్ లైఫ్ ఏంటో తాను చూసుకున్నాడు. అప్పట్నుంచి వార్తల్లో లేకుండా పోయిన హీరా ఇప్పుడు తన బ్లాగ్ లో అజిత్ గురించి తీవ్ర ఆరోపణలు చేసింది.
కెరీర్ స్టార్టింగ్ లో నేను ఓ హీరోతో లాంగ్ టర్మ్ రిలేషన్ లో ఉన్నాను. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కొన్నాళ్ల తర్వాత అతను నన్ను ఓ మోసగత్తెగా, డ్రగ్స్ బానిసగా చిత్రకరించి, నా క్యారెక్టర్ ను సమాజంలో దిగజార్చడమే కాకుండా ఓ క్రూరమైన వ్యక్తిగా నన్ను ముద్రవేశాడు. నేను అతన్ని నమ్మి, అండగా ఉండి, అన్ని విషయాల్లో అతన్ని జాగ్రత్తగా కాపాడుంటూ వచ్చినప్పటికీ అతను నన్ను ఒక్క రాత్రిలో విలన్ గా మార్చేశాడు అని హీరా తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.
వెన్నెముక సర్జరీ జరిగినప్పుడు అతను హాస్పిటల్ లో ఉంటే పగలు, రాత్రి తేడా లేకుండా అతనికి సేవలు చేశాను. అఖరికి తన బెడ్ ప్యాడ్స్ కూడా మార్చానని, అయినప్పటికీ అతను తనను పట్టించుకోవడం మానేయడంతో పాటూ, కలవడానికి, ఫోన్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా చేశాడని తెలిపింది.
అక్కడితో ఆగకుండా అతని ఫ్యాన్స్ తో దాడులు చేయించి, తన పరువు తీసేశాడని, కేవలం అతని వల్లే తాను సినిమాలకు దూరమయ్యాయనని చెప్పింది హీరా. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న టైమ్ లో ఓ మధ్యవర్తి ద్వారా తమకు మీటింగ్ జరిగిందని, అప్పుడు అతను తనను వదిలేస్తున్నట్టు చెప్పడమే కాకుండా పనిమనిషిలా కనిపించే నటిని పెళ్లి చేసుకుంటున్నానని, అప్పుడు తాను ఎవరితో శృంగారం చేసినా ఇబ్బంది ఉండదని చెప్పాడని హీరా తన బ్లాగులో పేర్కొంది. అజిత్ తో రిలేషన్ లో ఉన్న టైమ్ లో వార్తల్లో ఉన్న హీరా గత కొన్నేళ్లుగా అసలు ఏమైందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు సడెన్ గా మళ్లీ ఈ ఆరోపణలతో వార్తల్లోకెక్కింది.