Begin typing your search above and press return to search.

తల లేకుండా వణుకు పుట్టిస్తున్న హెబ్బ

అయితే, ఈ సారి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా మనకు అందించడానికి రెడీ అయ్యింది. అదే గ్రేట్ ఇండియన్ మర్డర్స్.

By:  Tupaki Desk   |   26 Sep 2023 7:50 AM GMT
తల లేకుండా వణుకు పుట్టిస్తున్న హెబ్బ
X

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు డిఫరెంట్ వెబ్ సిరీస్ లు, పలు కొత్త సినిమాలతో అలరించింది. అయితే, ఈ సారి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా మనకు అందించడానికి రెడీ అయ్యింది. అదే గ్రేట్ ఇండియన్ మర్డర్స్. టైటిల్ పేరు ఎంత కొత్తగా ఉందో, పోస్టర్ కూడా అంతే భిన్నంగా ఉంది.


ఈ సినిమా లో హీరోయిన్ హెబ్బా పటేల్ నటిస్తోందనే విషయం పోస్టర్ ద్వారానే అర్థమౌతోంది. కుర్చీలో తల లేకుండా ఓ మహిళ బాడీ ఉంది. సరిగ్గా పైన గోడ మీద ఫోటోలో హెబ్బా పటేల్ ఉండటం విశేషం. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు వెన్నులో వణుకుపుట్టేలా సాగుతుందని తెలుస్తోంది.

అక్టోబర్ 26వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఫుల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ సాగుతుంది. రామ్ కార్తిక్‌, హెబా ప‌టేల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. విప్ల‌వ్ కోనేటి ద‌ర్శ‌క‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకి, శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించారు. న‌రేష్ వీకే, ప‌విత్రా లోకేష్‌, జ‌య‌ప్ర‌కాష్‌ లాంటి సీనియర్ నటులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మదనపల్లి టౌన్ లో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరెకిక్కించడం విశేషం. ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడాలని అనుకుంటుంది. వారు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? మళ్లీ పుడతామనే నమ్మకంతో అలా ప్రయత్నించారా అనే కథ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.

అయితే, అచ్చం చచ్చిపోవడం , చంపుకోవడమే కాదు, సినిమా లో చాలా గొప్ప ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ప్రేమ, రొమాన్స్ అన్నింటినీ కలిపి తీసిన కథ ఇది. థ్రిల్లర్ జోనర్ లో మూవీ సాగుతుంది. ఇక, ఈ మూవీలో నరేష్, పవిత్రలు భార్యభర్తలుగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.