Begin typing your search above and press return to search.

వెంక‌టేష్ రెండో కుమార్తె వివాహం

కొత్త జంటతో వెంకటేష్ దగ్గుబాటి, ఆయ‌న‌ భార్య నీరజ కలిసి ఉన్న ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2024 5:23 AM GMT
వెంక‌టేష్ రెండో కుమార్తె వివాహం
X

టాలీవుడ్ నాలుగు పిల్ల‌ర్స్ లో ఒక‌రైన ద‌గ్గుబాటి వెంకటేష్ చిన్న కూతురు హయవాహిని దగ్గుబాటి విజ‌య‌వాడ‌కు చెందిన వైద్యుడు నిశాంత్ ని పెళ్లాడారు. 2023 అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక‌టైంది. నిశాంత్ ఉన్న‌త విద్యార్హ‌త క‌లిగిన ప్ర‌ముఖుడు. MD అండ్ DM గా వైద్య‌ వృత్తిలో ఉన్న‌ నిశాంత్ పాతూరి వెంకట రామారావు-అరుణ దంపతుల కుమారుడు.

కొత్త జంటతో వెంకటేష్ దగ్గుబాటి, ఆయ‌న‌ భార్య నీరజ కలిసి ఉన్న ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లికి పలువురు పరిశ్రమ పెద్దలతో పాటు, ఇరువైపుల స్నేహితులు, కుటుంబ సభ్యులు బంధువులు హాజ‌ర‌య్యారు. 2023 అక్టోబ‌ర్‌ లో విజయవాడలో నిశ్చితార్థం జ‌ర‌గ‌గా, దీనికి చిరంజీవి, మహేష్ బాబు హాజరయ్యారు. గ్రాండ్ సెలబ్రిటీ వెడ్డింగ్‌లకు భిన్నంగా, హయవాహిని వివాహం మార్చి 15న అత్యంత సింపుల్ గా జ‌రిగింద‌ని స‌మాచారం. దగ్గుబాటి కుటుంబం వారి సన్నిహితుల స‌మ‌క్షంలో హైదరాబాద్‌లోని ఐకానిక్ రామా నాయుడు స్టూడియోస్ ఈ పెళ్లి జ‌రిగిన‌ట్టు తెలిసింది.

ఇంత‌కుముందు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ మెహెందీ నుండి కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసారు. మెహందీ నైగ్!! స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సమయాలు! ఈ అందమైన జంట జీవితకాలం ఆనందంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని న‌మ్ర‌త‌ క్యాప్షన్ ఇచ్చింది. గతేడాది జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, మహేష్ బాబు, రానా దగ్గుబాటి, నాగ చైతన్య త‌దిత‌రులు ఉన్నారు. హయవాహిని నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైర‌ల్ అయ్యాయి.

వెంకటేష్- నీరజ దంప‌తులు ముగ్గురు కుమార్తెలు... ఒక కొడుకుకు గర్వకారణమైన తల్లిదండ్రులు. వారి పెద్ద కుమార్తె అశ్రిత 2019లో వినాయక్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హయవాహిని తన వైవాహిక జీవితాన్ని ప్రయాణాన్ని ప్రారంభించే వంతు వచ్చింది. అశ్రిత ప్రేమ వివాహం చేసుకోగా, హయవాహిని పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేసుకున్నార‌ని స‌మాచారం.