Begin typing your search above and press return to search.

నైట్ పార్టీలో స్టార్ వైవ్స్ చిల్లింగ్!

అయితే ఇదే క‌ల్చ‌ర్ టాలీవుడ్ లో ఉందా? అంటే ఇక్క‌డ అలాంటి ధోర‌ణి ప‌రిమితం అనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   26 Feb 2024 12:17 PM GMT
నైట్ పార్టీలో స్టార్ వైవ్స్ చిల్లింగ్!
X

బాలీవుడ్ నుంచి పార్టీ క‌ల్చ‌ర్ అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు విస్త‌రించింది. అక్క‌డ ప్ర‌ముఖ సెల‌బ్రిటీ వైవ్స్, సెల‌బ్రిటీ డాట‌ర్స్ స‌హా ప్ర‌తి లేడీ ఎంట‌ర్ ప్రెన్యూర్ నైట్ పార్టీల్లో చిల్ చేయ‌డం ప్ర‌త్యేకంగా చూస్తున్న‌దే. అయితే ఇదే క‌ల్చ‌ర్ టాలీవుడ్ లో ఉందా? అంటే ఇక్క‌డ అలాంటి ధోర‌ణి ప‌రిమితం అనే చెప్పాలి.


తెలుగు చిత్ర‌సీమ‌లో పార్టీ క‌ల్చ‌ర్ చాలా భిన్న‌మైన‌ది. సాంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన‌ది. త‌మ కుటుంబాల్లో ఏదైనా ముఖ్య‌మైన ఈవెంట్ కి సాటి సెల‌బ్రిటీల‌ను ఆహ్వానించ‌డం.. పార్టీని సాధ్య‌మైనంత డీసెంట్ గా కానిచ్చేయ‌డం ఇక్క‌డ రెగ్యుల‌ర్ గా చూసే వ్య‌వ‌హారం.

వారంతా అన్యోన్యంగా ఆహ్లాదంగా పార్టీని సెల‌బ్రేట్ చేస్తారు. ఇదిగో ఇప్పుడు తెలుగు సినీస‌ర్కిల్స్ లోని ప‌లువురు సెల‌బ్రిటీలు ఒకే వేదికకు వ‌చ్చారు. అక్క‌డ పార్టీ జ‌రుగుతోంది. ఈ పార్టీలోంచి కొన్ని అంద‌మైన ఫోటోల‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ భార్య న‌మ్ర‌త షేర్ చేసారు. ఇందులో న‌మ్ర‌త‌తో పాటు, ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి కూడా క‌నిపించారు. న‌మ్ర‌త కొంత చిల్లింగ్ గా (ముంబై గాళ్ క‌దా) అధునాత‌న‌ క‌ల్చ‌ర్ కి సింబాలిక్ గా క‌నిపించినా కానీ, ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ ప్ర‌ణతి ఒక కార్న‌ర్ లో సింపుల్ గా న‌వ్వేస్తూ క‌నిపించారు. హైదరాబాద్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఎంఈఐఎల్‌ ఎండీ కృష్ణారెడ్డి, ఆయన భార్య సుధారెడ్డిల 25వ వివాహ వార్షికోత్సవంలో స్టిల్ ఇది. ఈవెంట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ.. బిగ్ డే జ‌రుపుకుంటున్న‌ జంటకు తన శుభాకాంక్షలను తెలియజేసారు న‌మ్ర‌త‌.

ఈ ఈవెంట్లో నమ్రత- లక్ష్మీ ప్రణతి ఇద్దరూ స్నేహితులతో క‌లిసి రుచికరమైన ఆహారం పానీయాలను ఆస్వాధిస్తూ క‌నిపించారు. ర‌క‌ర‌కాలుగా ఫోజులిచ్చిన ఫోటోలు ఇప్పుడు వెబ్ లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో సినీ ప్ర‌పంచం నుంచి కాకుండా ఇత‌ర వ్యాపార వ‌ర్గాల నుంచి స్నేహితులు కూడా సంద‌డి చేస్తూ క‌నిపించారు.