Begin typing your search above and press return to search.

టిల్లు తో 'ఉస్తాద్‌' సందడి వీడియో చూశారా..!

అలాంటి సిద్దు జొన్నలగడ్డ తో మంచు మనోజ్‌ అంతకు మించి అన్నట్లుగా వినోదాన్ని పండించాడు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 9:22 AM GMT
టిల్లు తో ఉస్తాద్‌ సందడి వీడియో చూశారా..!
X

మంచు మనోజ్‌ హోస్ట్‌ గా ఈటీవీ విన్ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న గేమ్‌ షో కమ్‌ టాక్‌ షో 'ఉస్తాద్‌' మొదటి ఎపిసోడ్‌ లో నాని ముఖ్య అతిథిగా హాజరు అయిన విషయం తెల్సిందే. రెండో ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోను ఈటీవీ విన్‌ ఓటీటీ విడుదల చేయడం జరిగింది.

మొదటి ఎపిసోడ్‌ లో యంగ్‌ హీరో నేచురల్‌ స్టార్ నాని హాజరు అవ్వగా... రెండో ఎపిసోడ్‌ లో మరో యంగ్‌ హీరో డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ సందడి చేశాడు. సాధారణంగానే సిద్దు జొన్నలగడ్డ చాలా జోవియల్‌ గా ఉంటాడు. అలాంటి సిద్దు జొన్నలగడ్డ తో మంచు మనోజ్‌ అంతకు మించి అన్నట్లుగా వినోదాన్ని పండించాడు.

సిద్దు ఏ స్క్రిప్ట్‌ రాయడం మొదలు పెట్టినా కూడా మొదట KISS అనే అక్షరాలను రాస్తాడని మంచు మనోజ్ సరదాగా అన్నాడు. చాలా సరదాగా మనోజ్ ఈ ఎపిసోడ్‌ ను నడిపించాడని ప్రోమో చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. ఒక వైపు సిద్దు నుంచి సినిమాలకు సంబంధించిన విషయాలను రాబడుతూనే మరో వైపు గేమ్‌ కూడా ఆడించాడు.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న నాని ఎపిసోడ్‌ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు డిజే టిల్లు ఫేమ్‌ సిద్దు ఎపిసోడ్‌ కి కూడా మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రోమో చూస్తూ ఉంటే అర్థం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం మంచు మనోజ్ హోస్ట్‌ గా కాకుండా కాస్త అతి చేస్తున్నాడు అనే ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ షో తీరును బట్టి మంచు మనోజ్‌ హోస్టింగ్‌ చేస్తున్నాడు అనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఈ షో కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో పాటు, చాలా కాలం తర్వాత మంచు మనోజ్‌ కనిపిస్తున్న నేపథ్యం లో ప్రేక్షకులు మరియు మంచు ఫ్యాన్స్ షో ను ఆధరిస్తున్నారు. ముందు ముందు ఎలాంటి గెస్ట్‌ లు ఈ ఉస్తాద్‌ తో సందడి చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి టిల్లు ఉస్తాద్‌ ప్రోమో ను చూసి ఎంజాయ్‌ చేయండి.