Begin typing your search above and press return to search.

వీడియో : సితార వేసుకున్న షర్ట్‌ చూశారా...!

సినిమాను గతంలోనే చూసిన సితార మళ్లీ తన తండ్రి సినిమాని చూసేందుకు మల్టీ ప్లెక్స్ కి వెళ్లినట్లు తాజా వీడియో ని బట్టి అర్థం అవుతుంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 5:51 AM GMT
వీడియో : సితార వేసుకున్న షర్ట్‌ చూశారా...!
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు తాజా చిత్రం గుంటూరు కారం ను ఆయన కూతురు సితార మరోసారి చూసింది. స్నేహితులతో కలిసి ఏఎంబీ మాల్‌ లో సీతూ పాప సినిమాను చూసింది. సినిమాను గతంలోనే చూసిన సితార మళ్లీ తన తండ్రి సినిమాని చూసేందుకు మల్టీ ప్లెక్స్ కి వెళ్లినట్లు తాజా వీడియో ని బట్టి అర్థం అవుతుంది.

సితార ఇప్పటికే రెండు మూడు సార్లు సినిమాను చూసినట్లుగా తెలుస్తోంది. తాజాగా మరోసారి సితార సినిమాను చూసింది. ఈసారి ఆమె మల్టీప్లెక్స్ కి వెళ్లిన సమయంలో ధరించిన డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ధరించిన రెడ్‌ చెక్స్ షర్ట్‌ ను సితార ధరించింది.

సితార ఆ షర్ట్‌ ను స్టైల్ గా ధరించడం చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. గతంలోనే చాలా మంది ఫ్యాన్స్ ఈ షర్ట్‌ ను కొనుగోలు చేసి ధరించారు. ఇప్పుడు తండ్రి ధరించిన అదే రకం షర్ట్‌ ను సితూ పాప కూడా ధరించడంతో ఆ షర్ట్‌ కి మరింత పాపులారిటీ దక్కినట్లు అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వంశీ పైడిపల్లి కూతురు మరియు మెహర్‌ రమేష్‌ కూతురుతో కలిసి సితార ఏఎంబీలో సందడి చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.