Begin typing your search above and press return to search.

స్వయంభు.. నిఖిల్ హార్డ్ వర్క్ చూశారా

అయితే ఈ సినిమా కంప్లీట్ షూటింగ్ కాకుండానే రిలీజ్ చేయడం వలన ఫెయిల్ అయ్యిందని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 10:54 AM GMT
స్వయంభు.. నిఖిల్ హార్డ్  వర్క్ చూశారా
X

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. తరువాత 18 పేజెస్ సినిమాతో సూపర్ మరో సూపర్ హిట్ కొట్టారు. ఈ ఏడాది స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమా కంప్లీట్ షూటింగ్ కాకుండానే రిలీజ్ చేయడం వలన ఫెయిల్ అయ్యిందని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో స్వయంభు ఒకటి. ఈ సినిమా పీరియాడిక్ జోనర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధం అవుతోంది. దీంతో పాటు రామ్ చరణ్ ప్రొడక్షన్ లో ది ఇండియన్ హౌస్ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే చేస్తున్నారు. ఈ సినిమాలపై నిఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే స్వయంభు సినిమా హిస్టోరికల్ నేపథ్యంలో నడిచే కథగా తెరకెక్కుతోంది. అలాగే ఈ చిత్రంలో నిఖిల్ ఒక వారియర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ కారణంగా సినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా ప్రాచీన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ముఖ్యంగా కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. మూడు నెలల పాటు ప్రత్యేకంగా యుద్ధ విద్యలపై నిఖిల్ శిక్షణ తీసుకోవడం విశేషం.

తాజాగా సోషల్ మీడియాలో నిఖిల్ కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో ఒకటి ట్విట్టర్ లో షేర్ చేశారు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ తో మార్షల్ ఆర్ట్స్, కత్తి ఫైటింగ్ ని నిఖిల్ చాలా శ్రద్ధతో ఈ వీడియోలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ అంటూ ఈ వీడియోని నిఖిల్ షేర్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఫిక్సల్స్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వచ్చే గతంలో సముద్రం ఒడ్డున రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకొని నిఖిల్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కూడా వైరల్ అయ్యింది. దీనిని బట్టి స్వయంభు సినిమా కోసం నిఖిల్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు.