Begin typing your search above and press return to search.

భయపెట్టడం కోసం మరో ప్రయత్నం

బాలీవుడ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారు అనే విషయమై ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది.

By:  Tupaki Desk   |   17 April 2025 7:25 AM
Haunted 3D Ghosts of the Past Bhatt Brothers Horror Roots!
X

బాలీవుడ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారు అనే విషయమై ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది. కంటెంట్‌ ది బెస్ట్‌గా ఉంటేనే సినిమాను ఆధరిస్తున్నారు. ఇటీవల వచ్చిన స్త్రీ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.800 కోట్లు వసూళ్లు చేసిన విషయం తెల్సిందే. ఆ హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాను హిందీ ప్రేక్షకులు ఆ స్థాయిలో హిట్‌ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకే పలువురు ఫిల్మ్‌ మేకర్స్ అదే జోనర్‌లో సినిమాలను తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్ మహేష్ భట్‌, విక్రమ్‌ భట్‌లు మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు థ్రిల్లర్‌ మూవీని రూపొందించే పనిలో పడ్డారు.

2023లో వీరి బ్యానర్‌ నుంచి వచ్చిన 1920 సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. కానీ 1990ల్లో వీరి కాంబోలో వచ్చిన పలు హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాలు షాకింగ్‌ వసూళ్లు నమోదు చేశాయి. ముఖ్యంగా హాంటెడ్‌, రాజీ, హేట్‌ స్టోరీ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విజయాలను సొంతం చేసుకున్న వీళ్లు మరో హర్రర్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను రెడీ అయ్యారు. 'హంటెడ్‌ 3డి : గోస్ట్స్‌ ఆఫ్ ది పాస్ట్‌' టైటిల్‌తో థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాను ప్రకటించి మొత్తం బాలీవుడ్ దృష్టిని ఈ భట్ సోదరులు తమ వైపుకు తిప్పుకోవడంలో కచ్చితంగా సఫలం అయ్యారు అనడంలో సందేహం లేదు.

ఈమధ్య కాలంలో వచ్చిన హర్రర్‌ సినిమాల్లో కాస్త కామెడీని సైతం జొప్పిస్తున్నారు. ఆ కామెడీ కారణంగా కొన్ని సినిమాలు పరువు పోగొట్టుకుంటున్నాయి. కామెడీ థ్రిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. అందుకే ఈ సినిమాను ఎలా తీసుకు వస్తారా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఆనంద్‌ పాండిర్‌, మహేష్‌ భట్‌, విక్రమ్‌ భట్‌ కాంబోలో హంటెడ్‌ మూవీ రూపొందుతున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో పాటు ఒక వీడియోను సైతం విడుదల చేశారు. విక్రమ్‌ భట్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒక మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.

మోషన్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో మహాక్షయ్‌ చక్రవర్తి, చేతనా పాండేలు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభం అయిందని సమాచారం అందుతోంది. తాజాగా సినిమా యూనిట్‌ సభ్యులు ఇదే ఏడాది సెప్టెంబర్‌ 26న సినిమాను థియేటర్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. భట్ సోదరులు కలిసి చేసిన ఎన్నో హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో ముందు నుంచే అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు ఈ హర్రర్‌ థ్రిల్లర్ ఉంటుందా అనేది చూడాలి.