Begin typing your search above and press return to search.

హ‌సీన్ దిల్‌రూబా ఈ సారైనా మెప్పిస్తుందా?

ప్రేమ‌, మ‌ర్డ‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన హ‌సీన్ దిల్‌రూబా సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజై మంచి హిట్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   6 May 2025 7:00 AM IST
హ‌సీన్ దిల్‌రూబా ఈ సారైనా మెప్పిస్తుందా?
X

తాప్సీ ప‌న్ను ప్ర‌ధాన పాత్ర‌లో క‌నికా థిల్లాన్ రూపొందించిన హ‌సీన్ దిల్‌రూబా ఫ్రాంచైజ్ ఇండియ‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకుంది. ఈ ఫ్రాంచైజ్ లో మొద‌టి సినిమా 2021లో రిలీజైంది. ఆ సినిమాలో స‌స్పెన్స్, డార్క్ కామెడీతో పాటూ బోల్డ్ కంటెంట్, తాప్పీ- విక్రాంత్ మాస్సే మ‌ధ్య కెమిస్ట్రీ అంద‌రినీ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

ప్రేమ‌, మ‌ర్డ‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన హ‌సీన్ దిల్‌రూబా సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజై మంచి హిట్ గా నిలిచింది. కానీ దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఫిర్ ఆయి హ‌సీన్ దిల్‌రూబా మాత్రం అంచ‌నాలను అందుకోలేక‌పోయింది. హ‌సీన్ దిల్ రూబాకు సీక్వెల్ గా గ‌తేడాది వ‌చ్చిన ఫిర్ ఆయి హ‌సీన్ దిల్ రూబాపై భారీ అంచ‌నాలున్న‌ప్ప‌టికీ ఆ సినిమా అంద‌రినీ నిరాశ ప‌రిచింది.

ఫిర్ ఆయి హ‌సీన్ దిల్‌రూబా ప్లాట్ ఆడియ‌న్స్ కు చాలా ఫోర్డ్స్ గా అనిపించ‌డంతో పాటూ ఆ సినిమాలో థ్రిల్ పెద్ద‌గా లేక‌పోవ‌డం అంద‌రినీ తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఈ సీక్వెల్ లో స‌న్నీ కౌశ‌ల్ జాయిన్ అయిన‌ప్ప‌టికీ అది పెద్ద‌గా ఇంపాక్ట్ చూపించ‌లేక‌పోయింది. స్క్రీన్ ప్లే కూడా షార్ప్ గా లేక‌పోవ‌డంతో సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు హ‌సీన్ దిల్‌రూబా ఫ్రాంచైజ్ లో మూడో పార్ట్ అధికారికంగా మొద‌లైంది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఎగ్జైట్‌మెంట్ తో పాటూ అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సినిమాను గ‌త సినిమాల కంటే థ్రిల్లింగ్ గా, సినిమా స్థాయిని భారీగా పెంచి తెర‌కెక్కించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే యూనిట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. హ‌సీన్ దిల్‌రూబా లానే ఈ సినిమాను కూడా మేక‌ర్స్ హిట్ చేసి, మంచి టాక్ తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి ఈ సినిమా హిట్ అందుకుంటుందా లేదా రెండో భాగంలాగా ఫ్లాప్ గా నిలుస్తుందా అని చూడ్డానికి ఆడియన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.