హర్షవర్ధన్ కెరీర్ కీలక మలుపులో
తాజాగా 'దీవానియత్' అనే రొమాంటిక్ డ్రామాకు హర్ష్ సంతకం చేసాడు. ఇందులో సోనమ్ బజ్వా కథానాయిక.
By: Tupaki Desk | 19 April 2025 8:00 AM ISTటాలీవుడ్ లో 'తకిట తకిట' లాంటి ఫ్లాప్ సినిమాతో మొదలయ్యాడు హర్షవర్ధన్ రాణే. సికిందరాబాద్ లో ఫుట్ పాత్ వ్యాపారం కూడా చేసాడు. అక్కడ పాత సోఫాలు రిపేర్ చేసి అమ్మాడు. కార్పెంటర్ గా పని చేసి సంపాదించిన దాంతో జీవించానని తెలిపాడు. చాలా కష్టపడుతూనే సినిమాల్లో ట్రై చేసాడు. లక్కీగా తకిట తకిట రూపంలో నిర్మాతగా మారిన నటి భూమిక పెద్ద లిఫ్ట్ ఇచ్చారు. అయినా తొలి సినిమా డిజాస్టర్ అయింది. దీంతో నటుడిగా హిందీ పరిశ్రమకు పరిచయమయ్యాడు.
అక్కడ సనమ్ తేరి కసమ్ అనే రొమాంటిక్ డ్రామాలో నటించాడు. ఇది కోవిడ్ సమయంలో విడుదలై బిగ్ ఫ్లాపైంది. కానీ దీనిని ఇటీవల రీరిలీజ్ చేయగా ఏకంగా 40 కోట్లు వసూలు చేసి సెకండ్ రిలీజ్‌లలో ది బెస్ట్ అని నిరూపించింది. ఈ విజయం హర్షవర్ధన్ రాణేకు పెద్దగా కలిసొస్తోంది. ఇటీవల వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తన్నాడు.
తాజాగా 'దీవానియత్' అనే రొమాంటిక్ డ్రామాకు హర్ష్ సంతకం చేసాడు. ఇందులో సోనమ్ బజ్వా కథానాయిక. మిలాప్ జవేరీ ఈ రొమాంటిక్ డ్రామాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే స్వతహాగా మిలాప్ జవేరీ తన సొంత జానర్ వదిలేసి ఇప్పుడు కొత్త జానర్ కి మారడంతో ఆయన ఆశించిన రేంజులో ఇతడిని ఆవిష్కరిస్తారా? అన్నది చర్చగా మారింది. రాణే ఇప్పుడు మరింతగా నిరూపించుకునే సమయం వచ్చింది. దర్శకుడు ప్రతిభావంతుడే. కథ కూడా ఆసక్తికరంగా నిజాయితీ ఉన్న గ్రౌండెడ్ లవ్ స్టోరి అని ప్రచారం చేస్తున్నారు. దర్శకుడికి మార్జవాన్ , సత్యమేవ జయతే 2 కంటే ఓ భిన్నమైన ప్రయత్నమిది. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడని సమాచారం. బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధిస్తే తదుపరి బాలీవుడ్ లో లాంగ్ రన్ కొనసాగించేందుకు రాణేకు ఛాన్సుంటుంది.