Begin typing your search above and press return to search.

4 తరాలతో దిల్ రాజు కూతురు.. ఇంట్లోనే తల్లి విగ్రహం..

అదే సమయంలో హర్షితా రెడ్డి.. చనిపోయిన తన తల్లి అనిత విగ్రహంతో తీసుకున్న పిక్స్ ను పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   12 May 2025 9:37 AM
Dil Rajus Daughter Harshitha Reddy Shares Emotional Tribute to Late Mother
X

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హర్షితా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. తండ్రి అడుగుజాడల్లో ఆమె కూడా నడిచారనే చెప్పాలి. కొంత కాలం క్రితం నిర్మాణ రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ను నిర్వహిస్తూనే.. దిల్ రాజు ప్రొడక్షన్ పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు హర్షితా రెడ్డి.


అయితే నిన్న మదర్స్ డే సందర్భంగా అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమ తమ మదర్స్ తో దిగిన పిక్స్ తో షేర్ చేశారు. అదే సమయంలో హర్షితా రెడ్డి.. చనిపోయిన తన తల్లి అనిత విగ్రహంతో తీసుకున్న పిక్స్ ను పోస్ట్ చేశారు. "మదర్స్ డే. 4 తరాలు. మిస్ యు మా … లవ్ యూ" అంటూ రాసుకొచ్చారు.

అందులో హర్షితా రెడ్డి కూతురు, అమ్మమ్మ కూడా ఉండడం విశేషం. నాలుగు తరాలు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. అదే సమయంలో హర్షిత పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమ్మ అంటే ఎంత ప్రేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంట్లోనే తల్లి విగ్రహం పెట్టుకున్న హర్షితపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తల్లిపై ప్రేమ అంటే అలా ఉండాలని చెబుతున్నారు. అయితే దిల్ రాజు మొదటి భార్య, హర్షిత తల్లి అనిత.. అనారోగ్యంతో కొంతకాలం క్రితం చనిపోయారు. 2017లో గుండెపోటుతో మరణించారు. కాగా, ఇప్పుడు హర్షిత పోస్ట్ చేసిన పిక్స్ ను చూసిన తర్వాత.. తల్లి చనిపోయిన నుంచి దిల్ రాజు గారాలపట్టి తనకు జన్మనిచ్చిన అనిత జ్ఞాపకాల్లోనే బతుకుతున్నట్లు ఉన్నారని చెబుతున్నారు.

కాగా, మొదటి భార్య చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు దిల్ రాజు.. రెండో వివాహం చేసుకున్నారు. కోవిడ్ లాక్ డౌన్ టైమ్ లో తేజస్వినితో ఆయన రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. అతి తక్కువ మంది మాత్రమే వేడుకకు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత దిల్ రాజు, తేజస్వినికి ఒక మగ బిడ్డ జన్మించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే దిల్ రాజు రెండో పెళ్లికి అప్పుడు హర్షితా రెడ్డి కూడా అటెండ్ అవ్వలేదు. అమెరికాలో ఉన్న ఆమె.. లాక్ డౌన్ వల్ల భారత్ కు రాలేకపోయారు. ఆ సమయంలో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. రీసెంట్ గా ఆమె తన పదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ రీసెంట్ గా నెట్టింట వైరల్ గా మారాయి.