Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు ఇంట్రస్టింగ్ 'హరోమ్‌ హర'

దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. హరోమ్‌ హర సినిమా ఫస్ట్‌ లుక్ లో సుధీర్ బాబు చాలా సీరియస్ గా వెల్డింగ్‌ చేస్తున్నట్లుగా చూపించారు.

By:  Tupaki Desk   |   12 Nov 2023 11:22 AM GMT
సుధీర్ బాబు ఇంట్రస్టింగ్ హరోమ్‌ హర
X

సక్సెస్ మరియు ప్లాప్స్ తో సంబంధం లేకుండా సుధీర్ బాబు వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల మామా మశ్చింద్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు హరోమ్‌ హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. హరోమ్‌ హర సినిమా ఫస్ట్‌ లుక్ లో సుధీర్ బాబు చాలా సీరియస్ గా వెల్డింగ్‌ చేస్తున్నట్లుగా చూపించారు. సుధీర్‌ బాబు లుక్ మరియు ఇతర విషయాలను చూస్తూ ఉంటే ఒక మంచి కమర్షియల్‌ కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను రూపొందించినట్లు అనిపిస్తోందని అంటున్నారు.

హరోమ్‌ హర అనే టైటిల్ కి ది రివోల్ట్‌ అనే ట్యాగ్‌ లైన్‌ ను చేర్చడం జరిగింది. భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా ను సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. సెహరి ఫేమ్‌ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిందని యూనిట్‌ సభ్యులు పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా తెలియజేశారు.

1989 టైమ్‌ లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కథ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుధీర్‌ బాబు ఈ సినిమా కోసం కుప్పం యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. ఆ యాస కోసం సుధీర్‌ బాబు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.

తెలుగు తో పాటు తమిళం, కన్నడం, మలయాళం మరియు హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నవంబర్‌ 22న పవర్ ఆఫ్ సుబ్రమణ్యం అంటూ ఒక పవర్ ఫుల్‌ వీడియోను యూనిట్‌ సభ్యులు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.