Begin typing your search above and press return to search.

OPBK హరోంహర సాంగ్.. గూస్ బంప్సే!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు

By:  Tupaki Desk   |   11 Feb 2024 5:50 AM GMT
OPBK హరోంహర సాంగ్.. గూస్ బంప్సే!
X

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించకపోయినా.. డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో ఏ మాత్రం వెనకాడరు. అదే విధంగా మరో ఐదు రోజుల్లో ఊరు పేరు భైరవకోన అనే మరో కొత్త రకమైన చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఫైనల్‌ గా ఫిబ్రవరి 16వ తేదీన విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. విడుదలకు రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్‌ వేస్తున్నారు మేకర్స్. వాలెంటైన్స్ డే స్పెషల్ గా ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అవుతోంది.

మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి హరోంహర లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హరోంహర హరోంహర అభయంకర అంటూ సాగుతున్న ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సందీప్ కిషన్ చేతిలో ఆయుధంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ డివోషనల్ సాంగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. సింగర్ చైతు సత్సంగి లిరిక్స్ అందించి ఆలపించారు. శేఖర్ చంద్ర బాణీలు కట్టిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీలో కీలక సన్నివేశాల మధ్య ఈ సాంగ్ రానున్నట్లు తెలుస్తోంది.

హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథతోపాటు భక్తి పరమైన అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్‌ పై రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మించగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పించారు. సందీప్ కిషన్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.

ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకుంది చిత్ర యూనిట్. కానీ అప్పటికే చాలా సినిమాలు రేసులో ఉండడంతో ఈ మూవీ తప్పుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న విడుదల అవుతున్నట్టు ప్రకటించింది. అప్పటికే రవితేజ ఈగల్ మూవీకి సోలో రిలీజ్ అందిస్తామని నిర్మాతలంతా ప్రకటించడంతో.. వారి నిర్ణయాన్ని గౌరవించి మరోసారి రిలీజ్ డేట్ మార్చుకుంది. ఫైనల్‌ గా ఫిబ్రవరి 16న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాతో సందీప్ కమర్షియల్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరెలా ఉంటుందో చూడాలి.