Begin typing your search above and press return to search.

వైరల్‌ : రోలెక్స్ రేంజ్‌ లో హరోల్డ్‌ దాస్

కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి

By:  Tupaki Desk   |   16 Aug 2023 7:39 AM GMT
వైరల్‌ : రోలెక్స్ రేంజ్‌ లో హరోల్డ్‌ దాస్
X

కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కమల్‌ హాసన్‌ తో విక్రమ్‌ సినిమా చేసిన తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. లియో సినిమా ఆ రేంజ్ లోనే ఉంటుందని తాజాగా మరోసారి లోకేష్ కనగరాజ్‌ అర్జున్‌ సర్జా వీడియో తో చెప్పకనే చెప్పాడు.

లియో సినిమాను భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ వరుసగా సర్‌ ప్రైజ్‌ లతో సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. సంజయ్ దత్‌ తో పాటు ఈ సినిమాలో అర్జున్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా 40 సెకన్ల వీడియోను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచాడు.

కమల్‌ హాసన్ 'విక్రమ్‌' సినిమాలో చివర్లో వచ్చే సూర్య పాత్ర రోలెక్స్ ఏ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్ర స్థాయిలోనే... ఆ పాత్ర మాదిరిగానే అర్జున్ పాత్ర ఉంటుందని బర్త్‌ డే స్పెషల్ వీడియో చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

ఈ సినిమా లో అర్జున్‌ ను హరోల్డ్‌ దాస్ అనే పాత్రలో చూపించబోతున్నారు. సినిమాలోని ప్రతి పాత్రను అద్భుతంగా చిత్రీకరించగల సత్తా ఉన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్‌. అందుకే ఆయన హరోల్డ్‌ దాస్‌ పాత్రను కూడా అత్యంత విభిన్నంగా చూపించబోతున్నాడని ఎంట్రీ తోనే క్లారిటీ వచ్చింది.

లియో సినిమా లో విజయ్ కి జోడీగా త్రిష నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్‌ కార్యక్రమాల హడావుడి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఫోటోలు విడుదల చేస్తున్నారు. తాజా వీడియో వైరల్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.