Begin typing your search above and press return to search.

హరీష్ శంకర్ మరో మెగా కాంబో

దీనికి హరీశ్.. ముందు బాబాయ్ తర్వాత అబ్బాయి.. వరుణ్ తో త్వరలోనే.. అంటూ హింట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 5:36 AM GMT
హరీష్ శంకర్ మరో మెగా కాంబో
X

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ లో హరీశ్ శంకర్ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆయన సినిమా వస్తుంది అంటే పక్కా ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ లో ఒక మార్క్ సెట్ చేస్తారనే టాక్ ఉంది. ముఖ్యంగా మెగా హీరోలతో హరీశ్ శంకర్ సినిమా అంటే.. వేరె లెవెల్ లో ఉంటుంది. ఇప్పటికే ఆయన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ లతో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం మరోసారి పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు.

అయితే ఇప్పుడాయన మరో మెగా హీరోతో చేసేందుకు రెడీ అవుతున్నారా అంటే అవుననే అనుమానం కలుగుతోంది. ఆయన మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తాజాగా ఈ ఇద్దరు కలిసి పెట్టిన ఓ ట్వీటే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో ట్రెండ్ అవుతూ మెగా ఫ్యాన్స్ లో ఖుషీని నింపుతోంది.

ప్రస్తుతం వరుణ్.. గాంధీవధారి అర్జున అనే స్పై యాక్షన్ సినిమాతో వచ్చారు. ఈ చిత్రం ఆగస్ట్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా వరుణ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా ముచ్చటింగా.. ఓ అభిమాని హరీశ్ శంకర్ తో మళ్లీ సినిమా ఉంటుందా అని అడిగారు.

దీనికి వరుణ్.. హరీశ్ బ్రో వింటున్నావా అంటూ హరీశ్ శంకర్ కు ట్యాగ్ చేశారు. దీనికి హరీశ్.. ముందు బాబాయ్ తర్వాత అబ్బాయి.. వరుణ్ తో త్వరలోనే.. అంటూ హింట్ ఇచ్చారు. అలా హరీశ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇండైరెక్ట్ గా చెప్పారు. తన మెయిన్ ఫోకస్ ప్రస్తుతం పవన్ చేయనున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీదే ఉన్నట్లు తెలిపారు.

కాగా, గతంలో వరుణ్​తేజ్​- హరీశ్​శంకర్​ కాంబోలో వచ్చిన 'గద్దలకొండ గణేశ్'​ విడుదలై సూపర్​హిట్​గా నిలిచింది. ఇందులో నెగటివ్​ రోల్​ పోషించిన వరుణ్​ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. వరుణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకే అభిమానులు ఈ కాంబో రిపీట్ కావాలని ఆశిస్తున్నారు. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ ఆ మధ్యలో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానున్నట్లు ఈ మధ్యనే హింట్ ఇచ్చారు మేకర్స్.