Begin typing your search above and press return to search.

తమ్ముడు కన్నా ముందు అన్నయ్యతోనే..!

చిరు విశ్వంభర సినిమా పూర్తి కావడమే ఆలస్యం హరీష్ శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   15 April 2024 5:30 PM GMT
తమ్ముడు కన్నా ముందు అన్నయ్యతోనే..!
X

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లాక్ చేసుకున్న ఆయన ఆ మూవీ లేట్ అవుతున్న కారణంగా రవితేజతో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. అల్రెడీ మిస్టర్ బచ్చన్ సగానికి పైగా షూటింగ్ పూర్తైందని టాక్. ఈ సినిమా తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తాడని అనుకోగా మెగాస్టార్ చిరంజీఇతో సినిమా లైన్ చేస్తున్నాడు హరీష్ శంకర్.

చిరుతో హరీష్ శంకర్ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే ఈ సినిమా ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని టాక్. చిరు విశ్వంభర సినిమా పూర్తి కావడమే ఆలస్యం హరీష్ శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ తర్వాత అసలైతే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను హరీష్ శంకర్ OG పూర్తి చేయాల్సి ఉంది. కానీ పవన్ జూన్ వరకు బిజీ.. ఆ తర్వాత ఫ్రీ అయినా హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలను పూర్తి చేస్తాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ ను చిన్నగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే తమ్ముడు పవన్ సినిమాను పక్కన పెట్టి అన్నయ్య చిరుతో హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడట హరీష్ శంకర్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో చిరు సినిమా అంటే కచ్చితంగా ఫ్యాన్స్ కి మెగా మార్క్ ఎంటర్టైన్ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే చిరుతో హరీష్ శంకర్ చేసే స్టోరీ లాక్ అయినట్టు టాక్. అయితే హరీష్ శంకర్ ఎక్కువగా రీమేక్ సినిమాలనే చేస్తుంటాడు చిరుతో చేసే సినిమా కూడా రీమేకా లేదా ఒరిజినల్ స్టోరీనా అన్నది తెలియాల్సి ఉంది. చిరు రీమేక్ లతో ఇచ్చిన షాకుల వల్ల మెగా ఫ్యాన్స్ మాత్రం హరీష్ శంకర్ ఒరిజినల్ కథతోనే చేయాలని కోరుతున్నారు.

చిరంజీవి విశ్వంభర సినిమాన్ వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్నారు. ఆ సినిమాను 2025 సంక్రాంతికి లాక్ చేశారు. వశిష్ట తర్వాత హరీష్ శంకర్ ని ఫిక్స్ చేసుకున్న చిరు యువ హీరోలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.